For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య చిత్రంలో నాగార్జున

    By Srikanya
    |

    నాగార్జున,నాగచైతన్య,నాగేశ్వరరావు కలసి కృష్ణవంశి దర్శకత్వంలో చేస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజక్టు ఆగిపోయింది.అయితే నాగార్జున మాత్రం తన కుమారుడుతో కలిసి నటించాలనే నిర్ణయానకి వచ్చారని తెలుస్తోంది. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాల దర్శకుడు రాధామోహన్ దర్సకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దీని ద్వారా చైతన్య తమిళంలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయ. ఈ సినిమాకి 'గౌరవం' అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ చిత్రంలో నాగార్జున నటిస్తున్నారని తెలుస్తోంది. తండ్రి గౌవరం కోసం కష్టపడే కొడుకుగా నాగచైచతన్య కనపిస్తాడని, తండ్రి,కొడుకల రిలేషన్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు వినిపిస్తోంది.ఇప్పటికే నాగచైతన్యని,నాగార్జున ని కలిసిన రాధా మోహన్ స్టోరీ లైన్ వినిపించి ఓకే చేయించుకున్నట్లు చెప్తున్నారు. సెన్స్ బుల్ గా నడిచే డ్రామా తో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది.ప్రస్తుతం నాగచైతన్య రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ చిత్రంలో చేస్తున్నారు.

    అనంతరం ప్రస్దానం దర్శకుడు దేవకట్టాతో ఆటోనగర్ సూర్య చిత్రం చేస్తున్నారు. బెజవాడ చిత్రంని అక్టోబర్ 21 న విడుదల చేయాలని ఫిక్స్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.ఇక ఈ చిత్రం ఎనభైల్లోనూ,తొంభైల్లోనూ విజయవాడలో జరిగిన కాస్ట్ పాలిటిక్స్,యూనియన్ ఇష్యూల చుట్టూ తిరుగుతుంది. నాగచైతన్య 'బెజవాడ"గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది" అన్నారు.ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే చాలా కాంట్రావర్శీ పేరుకుంది.వర్మ ఈ చిత్రం టైటిల్ వివాదంతో సినిమా ప్రారంభించి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా నాన్న ఫేమ్ అమలా పౌల్ ని ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.

    English summary
    Radha Mohan (of Akashamanta and Gaganam fame) is planing a film called "Gouravam " with Naga Chaitanya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X