నాగ్- చైతన్య ఒకే భామతో-ప్రేక్షకులు ఆమోదిస్తారా?

అలానే నాగచైతన్య ట్వంటీప్లస్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయాల్సివస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అంతా కొత్త హీరోయిన్లు ట్వంటీప్లస్‌లే ఎక్కువగా ఉండటంతో మరి వీరంతా నాగచైతన్య లిస్ట్‌లో చేరిపోతున్నారు. అప్పుడు నాగార్జునకు హీరోయిన్ల కొరత తప్పదేమో అనిపిస్తోంది. ఇప్పటికే థర్టీప్లస్ హీరోయిన్లు అయిన త్రిష, నయనతార, ప్రియమణిలతో జతకట్టిన నాగార్జున కొడుకు పక్కన హీరోయిన్లుగా నటించిన సమంత, తమన్నా, నటించబోయే కాజల్, తాప్సీ వంటి తారలతో మరి జతకడతారా? ఒకవేళ కడితే ప్రేక్షకులు ఎంతమేరకు హర్షిస్తారు...లాంటి ప్రశ్నలు సంధించుకుంటే వాటికి సమాధానం దొరకడం కష్టమే. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పక్కన హీరోయిన్‌గా చేసిన శ్రీదేవి పక్కన నాగార్జున హీరోగా 'ఆఖరిపోరాటం" సినిమాలో చేశారు. ఆ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. కాకపోతే ఇప్పుడు మారిన ట్రెండ్‌కు అనుగుణంగా ఒక వేళ...నాగార్జున, నాగ చైతన్య ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేయాల్సి వస్తే ఇటువంటివి తెలుగు ప్రేక్షకులు ఆమోదిస్తారో లేదో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











