»   » నాగార్జున-నాని మల్టీ స్టారర్ మూవీ టైటిల్ ‘దేవదాస్’ (ఫస్ట్ లుక్)

నాగార్జున-నాని మల్టీ స్టారర్ మూవీ టైటిల్ ‘దేవదాస్’ (ఫస్ట్ లుక్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'దేవదాస్' అనే టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. నాని ట్విట్టర్ ద్వారా పోస్టర్ షేర్ చేస్తూ.... దేవ అండ్ మి అంటూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి దేవ పాత్రలో నాగార్జున, దాస్ పాత్రలో నాని కనిపించబోతున్నారని తెలుస్తోంది.

    డిఫరెంటుగా ఫస్ట్ లుక్

    శాంతభాయ్ మెమోరియల్ చారిటీ హాస్పటల్ పేరుతో ఉన్న మెడికల్ చీటీ మీద.... విభిన్నంగా టైటిల్ డిజైన్ చేశారు. శాంతభాయ్ మెమోరియల్ చారిటీ హాస్పటల్‌తో దేవ, దాస్‌కు సంబంధం ఉంటుందని తెలుస్తోంది.

    డాక్టర్ పాత్రలో నాని

    డాక్టర్ పాత్రలో నాని

    గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. `ఇది చాలా స‌ర‌దాగా సాగిపోయే సినిమా. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీ సినిమాల త‌ర‌హాలో ఉంటుంది. ఈ సినిమాలో నేను డాన్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తాను. నాకు వైద్యం చేసే డాక్ట‌ర్ పాత్ర‌లో నాని క‌నిపిస్తాడు. ఇలా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.

    మణి శర్మ సంగీతం

    మణి శర్మ సంగీతం

    నిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ''మా వైజయంతి బేనర్‌లో మణిశర్మ చేసిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌ అయ్యాయి. ఈ సినిమాని కూడా మ్యూజికల్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. మా బేనర్‌లో ఎన్నో మల్టీస్టారర్స్‌ చేశాం. అవన్నీ కమర్షియల్‌గా ఘనవిజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో చేస్తున్న మల్టీస్టారర్‌ కూడా బిగ్గెస్ట్‌ హిట్‌ అయి మా బేనర్‌కి మరింత మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

     సెప్టెంబర్ రిలీజ్

    సెప్టెంబర్ రిలీజ్

    ఈ చిత్రాన్ని సెప్టెంబర్ విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నట్లు నాని తెలిపారు. సంగీతం: మణిశర్మ, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, మాటలు: వెంకట్‌ డి. పట్టి, శ్రీరామ్‌ ఆర్‌. ఇరగం, స్క్రిప్ట్‌ అడ్వైజర్‌: సత్యానంద్‌, కో-డైరెక్టర్‌: తేజ కాకుమాను, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, నిర్మాత: సి.అశ్వనీదత్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.శ్రీరామ్‌ ఆదిత్య.

    English summary
    Nagarjuna, Nani Multi Starrer Titled as Devdas first look released. ‘Devadas’ is the title and the official poster is revealed by the makers. The poster has gun with bullets on the backdrop of doctor's prescription and makes interesting proceedings.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more