నాగ్ తో రిలయన్స్ గ్రూప్ సినిమా !
రిలయన్స్ గ్రూప్ మీడియా వింగ్ యాడ్ ల్యాబ్స్ నేరుగా సినిమా నిర్మాణ రంగంలో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. మూడు సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు కూడా. ఇందులో తొలి సినిమాను కమల్ హాసన్ తో తీయనుండగా రెండో సినిమాను రజనీకాంత్ తో తీయనున్నారు. రజనీకాంత్ హీరోగా రూపొందనున్న సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. అలాంటిదేమీలేదని వీరిద్దరూ ప్రస్తుతానికి చెబుతున్నా ఒప్పందాలు కుదిరాయని చెబుతున్నారు.
ఇక మూడవ సినిమాను నాగార్జునతో తీయనున్నారు. కమల్, రజనీకాంత్ లతో తమిళ సినిమాలు నిర్మిస్తున్న యాడ్ ల్యాబ్స్ నాగార్జునతో మాత్రం తెలుగులోనే సినిమాకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి నాగార్జున తమిళ బిల్లా తెలుగు రీమేక్ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో నాగార్జున హీరోగా చేయనున్నారు. తెలుగు బిల్లా పూర్తికాగానే యాడ్ ల్యాబ్స్ సినిమాలో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











