'సునో..సునో నా పేరే రగడ'....నాగార్జున
నాగార్జున తాజాగా సునో..సునో నా పేరే రగడ అంటూ పాటెత్తుకున్నాడు. ఆయన తాజా చిత్రం రగడ(ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు) కోసం ఈ పాటని అన్నపూర్ణ స్టూడియోలో ఛార్మినార్ గల్లీ సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ పాట వీరూపోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి పాటగా వస్తుందంటున్నారు. అనూష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఛార్మి ఓ సాంగ్ ని చేసింది. శ్రీ కామాక్షి ఎంటరప్రైజస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బిందాస్ తో విజయం సాధించిన వీరూపోట్ల ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడతారు.
అలాగే నాగార్జున...రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి రాజన్న అనే టైటిల్ ఫిక్స్ చేసారు. వీటితో పాటుగా నాగార్జున ..త్వరలో అరుంధతి తరహా ఓ సోషియో ఫాంటసీ చిత్రలో నటించబోతున్నారు. కామిడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే రాధామోహన్ దర్శకత్వంలో మొదలయిన గగనం చిత్రం షూటింగ్ పూర్తయింది.


Click it and Unblock the Notifications











