'భాయ్' అంటూ నాగ్ ని పడేసిన డైరక్టర్
నాగార్జున తాజాగా ముళ్ళపూడి వీరభద్రం చిత్రం ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూలరంగడులో బిజీగా ఉన్న వీరభధ్రమ్ తన తదుపరి చిత్రానికి సంభంధించి స్క్రిప్టును రైటర్స్ ని కూర్చొపెట్టుకుని రెడీ చేసుకుంటున్నాడు. అహనా పెళ్లంట చిత్రంతో విజయం సాధించిన వీరభద్రమ్ కి నాగార్జున డేట్స్ ఇవ్వటానికి కారణం అతను చెప్పిన టైటిల్ భాయ్ అనేదే అని తెలుస్తోంది. ఈ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో వీరభద్రమ్ రిజస్టర్ చేసారు. కామీడితో కలగలసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. మాస్, బాస్, కింగ్, డాన్ తరహాలో ఈ టైటిల్ ని పెట్టడం జరగింది. ఇక ప్రస్తుతం నాగార్జున ఢమురకం చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనూష్క చేస్తోంది.
ఢమురుకం చిత్రం సంక్రాంతి 2012కి విడుదల చేయటానకి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం స్టోరీ పాయింట్ గురించి దర్శకుడు శ్రీనివాస రెడ్డి చెబుతూ... గతంలో నేను రూపొందించిన యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో యముడు భూమి మీదకు వస్తాడు. ఇక్కడ శివుడు భూమి మీదకు క్రిందకి దిగి వస్తాడు. అప్పుడు నాగార్జునకీ, హీరోయిన్ కీ, శివుడుకీ మధ్య జరిగే కథనం ఆసక్తిగా ఉంటుంది అన్నారు. ఇక నాగార్జున పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇవివి హలో బ్రదర్ తరహాలో కామిడీ టచ్ తో సాగుతుంది అన్నారు. సోషియో ఫాంఠసీ గా రూపొందే ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. మరో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం నేపధ్యంలో రాజన్న అనే చిత్రం కూడా నాగార్జున చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











