ఆ టైటిల్ కు పద్నాలుగు లక్షలు అడిగారనే...నాగార్జున
మేం మొదట మా చిత్రానికి రమ్మీ అనే టైటిల్ అనుకున్నాం అయితే ఆ టైటిల్ మీడియా ద్వారా బయిటకు వచ్చి వేరే బ్యానర్ వారు రిజిస్టర్ చేసారు..దాంతో మోసగాడు అని మరో టైటిల్ అనుకున్నాం..అయితే ఆ టైటిల్ వెబ్ సైట్స్ లో వచ్చింది...మీడియాలో ప్రచారం పొందింది. దాంతో ఆ టైటిల్ నీ వేరే వారు రిజిస్టర్ చేసి పద్నాలుగు లక్షలు డిమాండ్ చేసారు... దాంతో ఇక ఈ సారి మా నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి,నేనూ కలసి టైటిల్ ని ఎక్కడా డిస్కస్ చేయకూడదు లీక్ అవుతుందని భావించాము. అలా కేడీ టైటిల్ ని అనుకుని అఫీషియల్ గా ప్రకటిస్తున్నాం. అంటూ తాము టైటిల్ కోసం పడ్డ శ్రమను వివరించారు నాగార్జున మీడియాతో. అలాగే తనకు డిసెంబర్ లో రిలీజ్ చేయాలనే సెంటిమెంట్ ఏమీ లేదని ప్రకటించారు. మీడియా తనకు ఆ సెంటిమెంట్ ను అంటగట్టిందని అన్నారు. నేను డిసెంబర్ లో నా చిత్రాలు రిలీజ్ చేయటానికి కారణం కేవలం శెలవలలో కలెక్షన్స్ బాగుంటాయనే ఉద్దేశ్యంతోనే..అంతే తప్ప మరేమీ కాదని వివరించారు. ఇక ఈ చిత్రం జనవరి 2010లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అందులోనూ మా నిర్మాతకు తమ బ్యానర్ 2010లో సిల్వర్ జూబ్లీ ఇయర్...జరుపుకోనుంది...అనేది కూడా రీజన్ అన్నారు.


Click it and Unblock the Notifications











