నాగ్, దశరథ్ చిత్రం టైటిల్ ఖరారు

By Srikanya

హైదరాబాద్: నాగార్జున కొత్త చిత్రానికి 'గ్రీకు వీరుడు' టైటిల్ నే ఖరారు చేసే అవకాసం ఉన్నట్లు సమాచారం. నాగార్జున,దశరథ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి ఈ టైటిల్ అయితే సరిపోతుందని భావిస్తున్నారు. ఈ మేరకు టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసారు. కామాక్షి మూవీస్‌ పతాకంపై డి.శివప్రసాద్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె.దశరథ్‌ దర్శకుడు.

ఈ చిత్రంలో నాగ్‌తో నయనతార ఆడిపాడుతోంది. ఈ చిత్రానికి గతంలో 'లవ్‌స్టోరీ', 'సరిలేరు నీకెవ్వరు' పేర్లు పరిశీలించారు. అయితే నాగ్‌ శైలికి, కథకి 'గ్రీకు వీరుడు' అనే పేరు అయితే మరింత బాగుంటుందని చిత్ర బృందం భావించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాల్ని ఈ నెల 26న విడుదల చేయబోతున్నారు.

'నిన్నే పెళ్లాడతా' చిత్రం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పాటల్లో 'గ్రీకు వీరుడు... నా రాకుమారుడు' ఒకటి. ఆ పాటలో నాగార్జున స్త్టెల్స్‌ యువతకు బాగా నచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే నాగ్‌ నటిస్తున్న చిత్రానికి 'గ్రీకు వీరుడు' అనే పేరుని ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో దాసరిగారి కుమారుడు చిత్రానికి కూడా ఈ టైటిల్ ని వినియోగించారు. గతంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సంతోషం' చిత్రానికి దర్శకత్వం వహించిన దశరత్ ఈ చిత్రానికి దర్శకుడు. నాగార్జున ఈ చిత్రంలో న్యూలుక్ తో కనిపిస్తుండటం, నయనతార లాంటి గ్లామర్ లేడీ ఉండటం, సంతోషం లాంటి హిట్ చిత్రాలు అందించిన నాగ్-దశరత్ కాంబినేషన్ కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X