ఆ దర్శకుడు తో నాగార్జున?
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మణి శంకర్ త్వరలో నాగార్జునతో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఈ మేరకు నాగార్జునకూ ఓ కథ వినిపించి ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. మొదట సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం చేస్తున్నాడని వార్తులు వచ్చినా తాజాగా మాత్రం నాగార్జున సూచనల మేరకు కథలో మార్పులు చేయటం లో బిజీగా ఉన్నదని తెలుస్తోంది. ఇక మణి శంకర్ గతంలో రుద్రాక్ష, టాంగో చార్లీ, డిసెంబర్ పదహారు, ముక్బిర్ వంటి బాలీవుడ్ చిత్రాలును రూపొందించారు. అయితే ఆయన సినిమాలు టెక్నికల్ గా స్టాండర్డ్స్ లో బాగున్నా చేపుకో తగ్గ విజయం ఏది సాదించ లేదు. అలాగే నాగార్జున కింగ్ చిత్రం పెద్దగా ఆడకపోవటం కూడా ఇలా కొత్త తరహ దర్సకులును ఎంచుకోవటానికి కారణంగా చెప్తున్నారు. ప్రస్తుతం నాగార్జున కిరణ్ అనే ఓ కొత్త దర్శకుని తో ఫిలిం కమిట్ అయ్యారు. ఇవన్ని చూస్తుంటే నాగార్జున మల్లి శివ నటి మేజిక్ ని రిపీట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాడా అని గుస గుసలు వినపడుతున్నై.


Click it and Unblock the Notifications











