ఆమె అందాలను జుర్రుకునేలా నాగ్ షాకింగ్ గెటప్ (ఫోటో)
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి భారతీయ సినీ తెరకు పరిచయమైన భామ నథాలియా కౌర్. బ్రెజిల్‌లో పుట్టిన ఈ చిన్నది డిపార్ట్‌మెంటు చిత్రంలోని ఐటం సాంగులో ఏ రేంజ్‌లో అందాలు ఆరబోసిందో తెలిసిందే. బికినీకి ఏమాత్రం తీసి పోని డ్రెస్సుతో విచ్చల విడిగా అందాలు చూపించి ఒక్కసారి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.
తాజాగా నథాలియా తెలుగు తెరపై కింగ్ నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించబోతున్నారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటను ఇక్కడ వీక్షించొచ్చు.
ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ పాటకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ ఇప్పటికే బ్యాంకాక్ లో చిత్రీకరించారు. మిగిలిన భాగాన్ని అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనదైన మాస్ మసాలా ట్యూన్లను దట్టించి ఈ సాంగ్ కంపోజ్ చేసారు.
అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక. 'భాయ్' చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుంది.
నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి. ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే డిసెంబర్లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది.


Click it and Unblock the Notifications












