twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున కొత్త గెటప్ వెనక లవ్ స్టోరీ...

    By Bojja Kumar
    |

    రామ్ చరణ్ పెళ్లిలో అక్కినేని నాగార్జున గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్నమైన గెటప్‌లో హెయిర్ స్టయిల్‌తో దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నాగార్జున అలాంటి కొత్త గెటప్‌లో కనిపించడానికి కారణం వేరే ఉంది. ఇదంతా తాను నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రం కోసమేనట. ఇందు కోసం గత కొంత కాలంగా సరికొత్త హెయిర్ స్టయిల్, మీసం, గడ్డం మెయింటెన్ చేస్తున్న నాగ్ అదే గెటప్‌తో చరణ్-ఉపాసన వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

    నాగార్జున, నయనతార హీరో హీరోయిన్లుగా దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 22నుంచి మొదలు కానుంది. ఆగస్టు నుంచి అమెరికాలో చిత్రీకరణ జరుగనుంది.

    ఈ చిత్రంలో నాగార్జున అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్‌ఐ పాత్రలో కనిపించనున్నారు. సంతోషం, మన్మథుడు తరహాలో ఉండే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈచిత్రం రూపొందబోతోంది. నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో గతంలో 'సంతోషం'చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ మళ్లీ కాంబినేషన్ అనగానే మార్కెట్లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది.

    ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: అనిల్ బండారి, సంగీతం: థమన్, ఆర్ట్: ఎస్. రవీందర్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, కో-డైరెక్టర్: కె. సదాశివరావు, స్క్రీన్ ప్లే: హరి కృష్ణ, అడిషనల్ స్క్రీన్ ప్లే: ఎం.ఎస్.ఆర్: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్, కో ప్రొడ్యూసర్: డి. విశ్వచందన్ రెడ్డి, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-దర్శకత్వం: దశరథ్

    English summary
    After the shooting of Shirdi Sai, Nagarjuna had gone of the radar and appeared in Ram Charan’s engagement in a entirely new look. He was seen in a ravishing beard and spiked hair. People in the vicinity were seen commenting that Nagarjuna looked younger than his sons Akhil and Naga Chaitanya.Nagarjuna’s next movie is reportedly a complete entertainer titled ‘Love Story’ directed by Dasarath. Nayantara will be pairing up with Nag in the movie. The regular shooting of the movie will begin from 22th of this month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X