నాగార్జున మరో తాజా గెటప్ తో మ్యాజిక్
నాగార్జునతో విక్కీదాదా, అల్లరి అల్లుడు, సీతరామరాజు, నేనున్నాను, కింగ్ వరుస చిత్రాలను తెరకెక్కించిన కామాక్షి కళా మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి నాగార్జున నటిస్తున్న తాజా చిత్రానికి కూడా నిర్మాత కావడం విశేషం. అలాగే ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేసిన హ్యాడ్ సమ్ హీరో నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రంతో కిరణ్ కుమార్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 'కింగ్" తర్వాత నాగార్జునతో చేస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రమిది. వైవిధ్యమైన కథలకు పెద్దపీట వేస్తూ, ఎప్పటికప్పుడూ ప్రేక్షకులు కోరుకునే కొత్తదనాన్ని తన చిత్రాల ద్వారా అందించే ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున తాజాగా మరో కొత్తదనంతో కూడిన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో నాగార్జున గెటప్ కూడా సరికొత్తగా వుంది. ఆయన పాత్ర కూడా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని తెలిసింది.
నవంబర్ 20 వరకు జరిగే నిర్విరామంగా జరిగే షూటింగ్ తో చిత్రం పూర్తవుతుంది. ఈ చిత్రం నాగార్జున గారికి ఈ బేనర్ లో పెద్ద హిట్ చిత్రమవుతుంది అన్నారు. నాగార్జున సరసన కథానాయికగా మమతా మోహన్ దాస్ హీరోయిన్ గా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్నది. ఈ సినిమాకి సంగీతాన్ని సందీప్ చౌతా అందించడం విశేషం.


Click it and Unblock the Notifications











