ఎఎన్నార్, నాగచైతన్య, నాగ్ కాంబినేషన్ చిత్రం ప్రకటన
నాగార్జున, నాగచైతన్య, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్ లో ఆ మధ్యన ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో అనుకున్న ఈ ప్రాజెక్టు అప్పుడు కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు నాగార్జున ఈ చిత్రం వచ్చే సంవత్సరం చేయనున్నట్లు ప్రకటించారు. నెల్లూరు వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడుతూ...ప్రస్తుతం నేను షిర్డీ సాయిబాబా చిత్రం చేస్తున్నాను. ఆ తర్వాత దశరధ్ చిత్రం ఉంటుంది. ఈ రెండు చిత్రాల తర్వాత మా నాన్నగారు, మా అబ్బాయి, నేను కలిసి నటించే చిత్రం చేస్తాను.
వచ్చే సంవత్సరం ఆ సినిమా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సినిమా కోసం స్క్రిప్టులు వింటున్నాము అన్నారు. ఇక అప్పట్లో కృష్ణవంసీ చేసిన స్క్రిప్టు నచ్చక ఆ ప్రాజెక్టుని రిజెక్టు చేసారు. ప్రస్తుతం ఇష్క్ డైరక్టర్ విక్రమ్ కుమార్ చెప్పిన ఓ స్క్రిప్టు ఓకే అయ్యిందని,ఈ ప్రాజెక్టు అతని దర్శకత్వంలోనే ఉండబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











