నాగార్జున, దిల్ రాజు చిత్రం జనవరి నుంచే...
నాగార్జున, రాధా మోహన్ కాంబినేషన్లో రూపొందనున్న పయినం చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశమంత వంటి హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాధా మోహన్ సున్నితమైన భావోద్వేగాల గల సబ్జెక్టుతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జన హీరోగా చేస్తున్న రమ్మీ చిత్రం డిసెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కిరణ్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. అలాగే దిల్ రాజు..ఎన్టీఆర్ తో బృందావనం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మున్నా చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్న వంశీ పైడపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
నాగార్జున దిల్ రాజు రాధా మోహన్ ప్రకాష్ రాజ్ త్రిష ఆకాశమంతా కిరణ్ రమ్మీ nagarjuna dil raju radha mohan prakash raj trisha akasamantha


Click it and Unblock the Notifications