twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ జేఏసీ కన్వీనర్‌గా సుప్రియ

    By Rajababu
    |

    తెలుగు చిత్ర పరిశ్రమను అతలాకుతలం చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్, ఇతర సమస్యలపై సినీ ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటైంది. సమస్యల పరిష్కారానికి జాయింట్‌ యాక్షన్‌ కమిటీని రూపొందించారు. ఈ కమిటీలో 21మంది సభ్యులు ఉండేలా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి శనివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఈ సమావేశంలో సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

    త్వరలోన మహిళా నటీనటులకు ఎదురయ్యూ సమస్యలకు పరిష్కారం చూపడానికి క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతుందని వెల్లడించారు. ఈ కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారని, వారిలో సగం మంది బయటవాళ్లు (ప్రజా సంఘాలు,లాయర్లు) ఉంటారని సమాచారం.

    Nagarjuna niece Supriya as Tollywood JAC Convenor

    టాలీవుడ్ జాయింట్ యాక్షన్ కమిటీకి హీరో నాగార్జున కోడలు యార్లగడ్డ సుప్రియ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వున్నారు. ఈ కమిటీలో ఇండస్ట్రీకి చెందిన 24 విభాగాల నుంచి అధ్యక్ష, కార్యదర్శుల పదవికి ఎన్నుకొంటారు. దర్శకురాలు నందినీరెడ్డి, స్వప్నాదత్‌ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇక నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నిర్ణయమైన ఈ కమిటీదే తుది నిర్ణయం.

    English summary
    Yarlagadda Supriya heading a A Joint Action committee for Tollywood. This committee will address the issues of Actress like casting couch and others. Directo Nandini Reddy, Swapna Dutt will act as members.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X