నాగ్ నామినేట్ చేస్తే...అల్లు అర్జున్ స్పందనేంటి?

By Srikanya

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ ఇచ్చిన పిలుపు మేరకు సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబం ఆదివారం 'స్వచ్ఛభారత్‌' కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఆవరణను వారు శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని అమల, నాగచైతన్య, అఖిల్‌, సుశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో నాగార్జున... మరో హీరో అల్లు అర్జున్ ని నామినేట్ చేసారు. ఇంతకీ అల్లు అర్జున్ ఏం చెయ్యబోతున్నారు..ఆయన స్పందన ఏమిటి అనేది ఇప్పుడు అభిమానుల్లో చర్చగా మారింది. ఇక 'స్వచ్ఛ భారత్‌'లో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ప్రముఖుల్లో అనిల్‌అంబానీ ఒకరు.

మనం సినిమాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు నాగార్జున. ఈ సక్సెస్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ తీసుకొన్న ఆయన కొత్త చిత్రమేది అంగీకరించలేదు. కానీ రీసెంట్ గా ఓ కథ నచ్చి ఆయన ఓకే చేసారు. నాగార్జున ...మాట్లాడుతూ ఆష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రామ్మోహన్ తయారు చేసిన కథతో నా తర్వాత చిత్రం వుంటుంది. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. పల్లెటూరి అనుబంధాలు, ఆప్యాయతలతో ఆద్యంతం ఆహ్లాదకరంగా వుంటుంది.

 Nagarjuna nominates Allu Arjun for Swachch Bharat

ఇందులో నేను ద్విపాత్రాభినయం చేయబోతున్నాను. హలో బ్రదర్ తరహాలో ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే వుంటుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. ఇద్దరూ హీరోయిన్‌లకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా సీనియర్ నటి రమ్యకృష్ణ ఎంపికైంది. మరో నాయికను త్వరలోనే ఎంపికచేస్తాం. అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సన్‌షైన్ పిక్చర్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం అని తెలిపారు.

కొత్త సినిమాల్లో ఆయన రొటీన్ కు భిన్నంగా కనిపిస్తారని చెబుతున్నారు. ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. తాత, మనవడు ఈ రెండు పాత్రల్లో నటించి నాగార్జున సరికొత్త వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నారట. మనవడి పాత్ర పోషించే నాగార్జున సరసన హీరోయన్ గా తొలుత తమన్నా అనుకున్నా.. ఆమె పారితోషికం విని షాకయ్యి.. ముంబైకి చెందిన మరో కొత్త హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. "సోగ్గాడే చిన్ని నాయన" అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా వివరాలను అక్కినేని జయంతి వేడుకలలో స్వయంగా నాగార్జున ప్రకటిస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X