నాగార్జున కూడా ఇపుడు మిలియనీరే...!
హైదరాబాద్: కింగ్ నాగార్జున కూడా ఇపుడు మిలియనీరే! నాగార్జునకు చాలా ఆస్తులు ఉన్నాయి....ఇందులో కొత్త విషయం ఏమిటని ఆలోచిస్తున్నారా! అయితే మీరే పప్పులో కాలేసినట్లే. ఆస్తుల పరంగా నాగార్జున ఎప్పుడో మిలియనీరే అయినప్పటికీ.....ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో మిలియన్ మార్క్ అభిమానులను సంపాదించుకోవడానికి చాలా సమయం పట్టింది. రెండు రోజు క్రితమే ఆయన ఫేస్ బుక్ ఫాలోవర్ల సంఖ్య మిలియన్ మార్క్ అందుకుంది. దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన నాగార్జున వివిధ బాషల్లో అభిమానులకు థాంక్స్ చెప్పేసారు.
నాగార్జున సినిమాల విషయానికొస్తే...
ఇటీవలే మనం సినిమాతో హిట్ కొట్టిన ఆయన.....త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ లేదా కార్తితో నాగార్జున స్క్రీన్ పంచుకోనున్నారు. దీంతో పాటు తన తనయుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఒక లైలా కోసం' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈచిత్రానికి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నారు.



Click it and Unblock the Notifications











