»   » హాట్ టాపిక్: నాగార్జున-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ!

హాట్ టాపిక్: నాగార్జున-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మూవీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో మళ్లీ మల్టీస్టారర్ సినిమాల జోరు సాగుతోంది. వెంకీ-మహేష్ కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం భారీ విజయం సాధించి నేపథ్యంలో ఇలాంటి సినిమాల వైపు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

హిందీలో హిట్టయిన 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు సర్వత్రా చర్చనీయాంశం అయింది. దీంతో పాటు మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు కూడా తెరకెక్కించేందుకు పలువురు నిర్మాతలు, దర్శకులు ప్లాన్ చేస్తున్నారు.

Nagarjuna – NTR multi starter

తాజాగా మరో ఆసక్తికర కాంబినేషన్ గురించి ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. నాగార్జున-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ఈచిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పివిపి సినిమా వారు నిర్మించే అవకాశం ఉన్నట్లు టాక్.

అయితే ఈ చిత్రం ఇంకా చర్చల దశలోనే ఉందని, అన్నీ ఓకే అయితే త్వరలోనే నిర్మాతల నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందిన అంటున్నారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ రభస చిత్రం షూటింగులో బిజీగా గడుపుతుండగా, నాగార్జున 'మనం' చిత్రం విడుదల విషయాల్లో బిజీగా ఉన్నారు.

English summary
The latest buzz in Filmnagar is that Akkineni Nagarjuna and Young Tiger NTR will be teaming up for a new project that will be directed by Vamshi Paidipally. PVP Cinemas might produce the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu