»   »  ఆఫీసర్ టీజర్: హైదరాబాద్ నుంచి వచ్చి పీకుతాడా.. నాగార్జున ఫైట్స్ చూడాల్సిందే!

ఆఫీసర్ టీజర్: హైదరాబాద్ నుంచి వచ్చి పీకుతాడా.. నాగార్జున ఫైట్స్ చూడాల్సిందే!

Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ నుంచి వచ్చి పీకుతాడా.. నాగార్జున ఫైట్స్ చూడాల్సిందే!

నాగార్జున, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ వచ్చింది. పలు హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. చాలా కాలం తరువాత నాగార్జున తిరిగి రాంగోపాల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆఫీసర్. మే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. వర్మ మరో మారు మాఫియా నేపథ్యంలో చిత్రీకరించిన చిత్రం ఇది. పూర్తి యాక్షన్ భరిత చిత్రంగా ఆఫీసర్ ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ గమనిస్తే ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.

 నాగ్, ఆర్జీవీ కలయికలో

నాగ్, ఆర్జీవీ కలయికలో

నాగార్జున, వర్మ సూపర్ హిట్ కాంబినేషన్లో రాబోతున్న మరో చిత్రం ఆఫీసర్. చాలా కాలం తరువాత ఈ కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతోంది. వర్మ నుంచి ఈ మధ్యకాలంలో హిట్ చిత్రం రాలేదు. అయినా కూడా ఆఫీసర్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

టీజర్ అదుర్స్

తాజగా ఆఫీసర్ టీజర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు. 'వాడు హైదరాబాద్ నుంచి వచ్చి ముంబై లో ఉన్నా మనల్ని పికుతాడా అంటూ విలన్స్ చెప్పే డైలాగులు ఆసక్తిగా ఉన్నాయి. టీజర్ మొత్తం నాగ్ యాక్షన్ సీన్స్ తో నింపేశారు.

పవర్ ఫుల్ ఆఫీసర్

పవర్ ఫుల్ ఆఫీసర్

నాగార్జున ఈ చిత్రంలో పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ముంబై మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

విడుదల అప్పుడే

విడుదల అప్పుడే

ఆఫీస్ చిత్రం మే 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంగా ఆఫీసర్ అలరించడానికి సిద్ధం అవుతోంది. రాంగోపాల్ వర్మ, సుధీర్ చంద్ర కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

English summary
Nagarjuna Officer movie teaser released. Ram Gopal Varma is the director of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X