నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం.. ఫొటోలు లీక్ చేసి గుడ్ న్యూస్ చెప్పిన నాగార్జున
తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో సందడి చేస్తూ స్టార్‌గా దూసుకుపోతోన్నాడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఈ మధ్య కాలంలో ప్రయోగాత్మక చిత్రాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోన్న అతడు.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్లతో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు. తాజాగా దీనిపై అతడి తండ్రి అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!
విడాకుల తర్వాత ప్రచారం
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభును ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ, వీళ్లిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. ఫలితంగా నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక, ఆమెతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య ప్రేమ, పెళ్లి గురించి ఎన్నో రకాల అంశాలు తెరపైకి కూడా వచ్చాయి.

శోభితతో చైతన్య డేటింగ్‌లో
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య చాలా రోజులుగా తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. దీనికి బలం చేకూర్చేలా తరచూ వీళ్లిద్దరూ కలిసి తీసుకున్న ఫొటోలు బయటకు వస్తున్నాయి. ఇలా కొన్నేళ్లుగా నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోతోంది.
నిశ్చితార్థం న్యూస్ వైరల్
శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య లవ్ మేటర్ హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయినప్పటికీ దీన్ని చాలా మంది సీరియస్‌గా తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరగబోతుందని బుధవారమే ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఇంట్లోనే దీన్ని జరపబోతున్నారని కూడా సమాచారం లీకైంది.

నాగార్జున నుంచి ప్రకటన
ముందు నుంచీ జరుగుతున్న ప్రచారం ప్రకారమే యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తన ప్రియురాలు శోభిత ధూళిపాళ్లతో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఇందులో భాగంగానే ముందుగా ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తాజాగా కింగ్ అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశాడు.
కొత్త జంటపై కామెంట్స్
నాగ చైతన్య - శోభిత ఎంగేజ్‌మెంట్ ఫొటోలను షేర్ చేసిన నాగార్జున X ఖాతాలో 'ఈ రోజు ఉదయం 9:42 గంటలకు జరిగిన మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాళతో జరిగినట్లు తెలియజేసేందుకు మేము సంతోషిస్తున్నాము. ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. దేవుడు వీళ్లను ఆశీర్వదిస్తాడు. ఇది అనంతమైన ప్రేమకు నాంది' అంటూ కామెంట్స్ చేశాడు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











