మీడియా నన్ను కొట్టింది.. దాంతో అందరూ షాక్‌కు గురయ్యారు.. నాగార్జున
టాలీవుడ్ రికార్డులను తిరుగరాసేందుకు మరోసారి దర్శకుడు రాంగోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున సిద్ధమవుతున్నారు.
Recommended Video

టాలీవుడ్ రికార్డులను తిరుగరాసేందుకు మరోసారి దర్శకుడు రాంగోపాల్ వర్మ, మన్మథుడు నాగార్జున సిద్ధమవుతున్నారు. నవంబర్ 20 తేదీన అన్నపూర్త స్టూడియోలో ఎక్కడైతే శివ షూటింగ్ ప్రారంభమైందో అక్కడే మళ్లీ వర్మ, నాగ్ చిత్రం ప్రారంభం కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాను ఉద్దేశించి నాగార్జున ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
నాగార్జున ఇంట్రస్టింగ్ ట్వీట్
పోలీస్ స్టోరీతో దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించబోయే చిత్రంలో నటించనున్నాననే విషయం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అయితే నేను స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించాలనుకొన్నాను. కానీ మీడియానే ఈ వార్తను ముందుగా బహిర్గతం చేసింది. ఆ విషయం నన్ను మీడియా కొట్టేసింది (నన్ను అధిగమించింది) అనే విధంగా ట్వీట్ నాగార్జున చేశారు.
అందరూ షాక్ గురయ్యారు..
1988లో రాంగోపాల్ వర్మ తీసే సినిమాలో నటించనున్నారనే వార్తకు అందరూ షాక్ అయ్యారు. ఇందేంటీ ఈయన ఇలాంటి నిర్ణయం తీసుకొన్నాడు అని అందరూ అనుకొన్నారు. అయితే వారందరికీ ఆర్జీవీ షాకిచ్చాడు. ఇప్పుడు 2017లో కొందరు హ్యాపీగా మరికొందరు షాక్‌లో ఉన్నారు. రాము మళ్లీ విజృంభిస్తారు అనే ఫీలింగ్‌తో నేను ఉన్నాను అని నాగార్జున మరో ట్వీట్ చేశారు.

రాంగోపాల్ వర్మ తండ్రి క్లాప్
నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఓ ప్రత్యేకత కూడా సంతరించుకొన్నది. 1988లో రాంగోపాల్ వర్మ తండ్రి ముహుర్తం షాట్‌కు క్లాప్ కొట్టారు. 2017లో వచ్చే ఈ చిత్రానికి కూడా ఈ నెల 16న ఓపెనింగ్ షాట్‌కు క్లాప్ కొట్టనుండటం విశేషం.

శివ సినిమాకు సీక్వెల్
25 ఏళ్ల తర్వాత నాగార్జునతో మళ్లీ సినిమా తీస్తున్నానని చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంది. శివ చిత్రానికి సీక్వెల్ అని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ఈ చిత్రం శివ పాత్రకుగానీ, కథకు గానీ సంబంధం లేదు అని ఫేస్‌బుక్‌లో వర్మ పోస్ట్ చేశారు.

నాగార్జునతో చాలా డిఫరెంట్
నాగార్జునతో తీయబోయే సినిమా చాలా కొత్తరకమైన కథ. నాగార్జున ఇంతకుముందు ఎన్నడూ నటించని పాత్ర. మీరు అలాంటి పాత్రలో నాగ్‌ను కూడా చూసి ఉండరు. నాకు శివతో దర్శకుడిగా బ్రేక్ ఇచ్చిన నాగార్జున, ఆదరించిన ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా ఉంటుంది అని వర్మ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రంలో నటించే వారి ఎంపిక పూర్తి కాలేదు. త్వరలోనే వారి వివరాలను వెల్లడిస్తాను అని వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











