ఫోటోలు: కోడలు సమంతకు నాగార్జున ఛాలెంజ్.. ఆ ముగ్గురికి కూడా!
తెలంగాణాలో హరితహారం కార్యక్రమం జోరుగా సాగుతోంది. సినీ సెలెబ్రిటీలంతా ఉత్సాహంగా మొక్కలు నాటుతున్నారు. ఇప్పుడు కింగ్ నాగార్జున వంతు వచ్చింది. టిఆర్ ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిసిన ఛాలెంజ్ ని స్వీకరించిన నాగార్జున నేడు అన్న పూర్ణ స్టూడియోలో మొక్కని నాటారు.
అన్నపూర్ణ స్టూడియోలో పనిచేస్తున్న స్టాఫ్ తో కలసి నాగార్జున గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తన వంతు పూర్తయిందని అంటూ నాగార్జున తన కోడలు సమంతకు సవాల్ విసిరారు. గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించాలని కోరారు. సమంతతో పాటు మరో ముగ్గురు సెలెబ్రెటీలకు నాగార్జున ఛాలెంజ్ విసరడం విశేషం.

కరణ్ జోహార్, కార్తీ, ధనుష్ ఈ కార్యక్రమంలో భాగం కావాలని నాగార్జున ట్విట్టర్ వేదికగా కోరారు. ఇప్పటికే మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి వంటి సెలెబ్రిటీలంతా గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు.


Click it and Unblock the Notifications











