ఆఫీసర్ షాక్ నుంచి తేరుకుని.. 50 కోట్ల దర్శకుడుతో నాగార్జున ప్లానింగ్!
Recommended Video

నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అతి దారుణంగా పరాజయం చెందింది. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. ఏ మాత్రం పస లేని కథ కథనాలతో ప్రేక్షకుల మౌత్ టాక్ ముందు కనీసం ఈ చిత్రం 7 రోజులు కూడా నిలవలేకపోయింది. థియేటర్ రెంట్ కట్టలేని స్థితిలో బయ్యర్లు దారుణమైన నష్టాలు చవిచూశారు. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఆఫీసర్ ఇచ్చిన షాక్ నుంచి నాగ్ ఇప్పుడిప్పుడే తేరుకుతున్నాడు. మరో క్రేజీ చిత్రాన్ని లైన్ లో పెట్టె పనిలో నాగ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మ్యాజిక్ పనిచేయలేదు
నాగార్జున, వర్మ కాంబినేషన్ లో శివ వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆఫీసర్ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. కానీ శివ చిత్రం తరహాలో వర్మ మ్యాజిక్ చేస్తాడేమో అని నాగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆఫీసర్ చిత్రం తేలిపోయింది.

నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్
యువ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం కలెక్షన్స్ పరంగా నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసింది. మరో మారు ఈ కాంబినేషన్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

సీక్వెల్ చేసే పనిలో
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడట. త్వరలో కళ్యాణ్ కృష్ణ నాగార్జునకు కథ వినిపించబోతున్నాడు. స్టోరీకి నాగ్ ఆమోద ముద్ర వేస్తె త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది.

వినోదాత్మక చిత్రం
సోగ్గాడే చిన్నినాయనా చిత్రం పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా, మంచి కుటుంబ సన్నివేశాలతో 2016 సంక్రాంతి బరిలో నిలిచి ఘనవిజయం సొంతం చేసుకుంది. దీని సీక్వెల్ ని కళ్యాణ్ కృష్ణ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ దర్శకుడు చివరగా తెరకెక్కించిన నేల టిక్కెట్ చిత్రం పరాజయం చెందింది.


Click it and Unblock the Notifications











