twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇన్‌సైడ్ టాక్: చిరంజీవే అల్లాడి పోయాడు...ఇక నాగార్జున వల్ల ఏమౌతుంది?

    నాగార్జున పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్ అయింది. ఆయన ఓ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి

    By Bojja Kumar
    |

    సినిమాలు చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే... ఇది చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టిన కొత్తలో వినిపించిన కామెంట్. కాల క్రమంలో ఆ కామెంట్సే నిజం అయ్యాయి. రాజకీయాలు అంటే చిరంజీవికి అంత ఈజీ కాదని తేలిపోయింది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్, కాంగ్రెస్ పార్టీలో విలీనం.

    ఎన్టీ రామారావు కాలంలో ఇది సాధ్యమైంది కదా.... అంటే అప్పటి పరిస్థితులు, పరిణామాలు పూర్తిగా విభిన్నం. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం సేవ చేయాలనే తపన, స్టార్ ఇమేజ్ ఉంటే సరిపోదు.... మంచి వారితో పాటు అవినీతి పరులు, అక్రమార్కులు, గుండాలు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు చుట్టూ పొంచి ఉండే ఈ బురద కూపంలో నెగ్గుకురాగలిగే సత్తా కూడా ఉండాలి.

    నాగార్జున పేరు తెరపైకి

    నాగార్జున పేరు తెరపైకి

    ఇటీవల నాగార్జున గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. నాగార్జున రాజకీయాల్లోకి వస్తున్నారని, ఓ పార్టీలో చేరుతున్నారని భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అసలు రాజకీయాల్లో నాగార్జున పేరు వినగానే అంతా షాకయ్యారు.

    నాగ్ వల్ల అవుతుందా?

    నాగ్ వల్ల అవుతుందా?

    నాగార్జున గురించి తెలిసిన చాలా మంది.... ఆయన అసలు రాజకీయాలకు సూట్ కారనే అంటున్నారు. చిరంజీవి లాంటి వ్యక్తే రాజకీయాల్లోకి వచ్చి అక్కడి పరిస్థితులు ఎదుర్కొనలేక విఫలం అయ్యారు, ఇక నాగార్జున వల్ల ఏమౌవుతుంది? అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

    అమల ఖండన

    అమల ఖండన

    నాగార్టున రాజకీయాల్లోకి వస్తున్నాడనే వార్తలపై ఇటీవల ఓ ప్రెస్ మీట్లో అమల స్పందించారు. ఆ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని ఆమె తెలిపారు. అలాంటి ప్రణాళికలు ఏమైనా ఉంటే తామే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చెబుతామన్నారు.

    పవర్ స్టార్ ఏం చేస్తారో?

    పవర్ స్టార్ ఏం చేస్తారో?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.... ‘జనసేన పార్టీ' స్థాపించి ఒక వినూత్నమైన ఆలోచనధోరణితో ముందుకు సాగుతున్నారు. రాజకీయాలు చేయడం అంటే అధికారం, డబ్బు సంపాదించడమే అని అంతా భావిస్తున్నా ఈ రోజుల్లో ఆయన ఏమరకు సక్సెస్ అవుతారు అనేది 2019 ఎన్నికల తర్వాత తేలనుంది.

    English summary
    Amala Akkineni issued a clarification that there is absolutely no truth in the speculations on social media. Condemning the rumours, She advised people to refrain from circulating such baseless stories. 'Nagarjuna willn't be joining any political party. We will announce the news officially by holding a press meet if we have any such plans,' she said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X