ఆ హీరో మనిషా? లేదా.....

పుట్టుకతో వికలాంగుడు...చిన్నప్పుడే తల్లిదండ్రులను మృత్యు వు కబళించింది..వరుసకు చిన్నమ్మ అతడికి అన్నీ అయి బాగోగులు చూస్తోంది. కుక్కి మంచంపైనే అ న్నీనూ...రేడియోపాటలు...టివికార్యక్రమాలు చూస్తూ అక్కినేని నాగార్జునకు వీరాభిమాని అయ్యాడు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ బాబునాయక్ తండాకు చెందిన 26సంవత్సరాల వయసున్న భూక్య నరేష్ కోరిక ఒక్కటే...తన అభిమాన హీరో అక్కినేని నాగార్జునను ఒక్కసారి చూసి చనిపోవాలని...అ కోరిక ఫ్యాన్స్ ద్వారా నాగార్జున దృష్టికి వచ్చింది.
అంతే...ఫ్యాన్స్ చొరువతో గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునను నరేష్ కలుసుకోగలిగాడు. అంతేకాదు తన వీరాభిమాని అయిన ఆ వికలాంగుడికి నాగార్జున 20వేల చెక్ ను ఆర్థిక సాయంగా అందజేశారు. ఇప్పటి నుంచి తాను నటించిన సినిమా విడుదలైన మొదటి రోజే నరేష్ కు ఆ సినిమా చూపించాలని తాను నటించిన సిడిలు, ఆడియో, వీడియోలు అతడికి అదజేయాలని నాగార్జున తన ఫ్యాన్స్‌ను ఆదేశించారు.
అంతకు ముందు ఏం జరిగిందంటే...భూక్య నరేష్ రేడియో, టివి ద్వారా నాగార్జునకు అయ్యాడు. నరేష్ కోరిక మేరకు బంధువులే అతన్ని సినిమాలకు కూడా తీసుకెళ్లేవారు. నాగార్జున పాటలంటే అతనికి ప్రాణం...ఆయన్ను చూడడం ఒక్కటే అతని ఆశ. అంతే మహబూబాబాద్ డివిజన్ ఫ్యాన్స్ ఈ సమాచారాన్ని పలుమార్లు నాగార్జునకు అందజేశారు.
ఎట్టకేలకు స్పందించిన అక్కినేని నాగార్జున, తన వద్దకు నరేష్ ను తీసుకురావాలని ఆదేశించారు. నాగార్జున ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు కె.సదాంత్, ఉపాధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, మహబూబాబాద్ డివిజన్, మండల, పట్టణ అధ్యక్షులు ఎండి. అక్సరలీ, తాళ్లపల్లి కుమార్, మద్దినేని హరికృష్ణ తదితరులు నాగార్జున ఆహ్వాన సమాచారాన్ని తండా వాసులకు అందజేశారు.
నాగార్జున నుంచి నరేష్‌కు ఆహ్వానం లభించడం తో గురువారం తెల్లవారు జామున బాబునాయక్ తండాలో పండుగ వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ జిల్లా, డివిజన్, మండల, టౌన్ బాధ్యులు బాణాసంచా కాలుస్తూ, బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేస్తూ నరేష్ ను తండావాసులు ఘనంగా హైదరాబాద్ కు సాగనంపారు.
ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న నరేష్‌ను అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జున పలకరించారు. ఆ వికలాంగుడి వీరాభిమానానికి పొంగిపోయారు. ఆర్థిక అవసరాల కోసం 20వేల చెక్ ను అందజేశారు. తను నటించిన సిడీలు అందజేయాలని ఫ్యాన్స్‌ను ఆదేశించారు. అక్కడి నుంచి నరేష్ కోరిక నెరవేరిందన్న తృప్తితో మహబూబాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు.


Click it and Unblock the Notifications











