మాస్ కి చెరకు గడ (రగడ ప్రివ్యూ)
వీరూ పోట్ల దర్శకత్వంలో డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించిన 'రగడ" చిత్రం ఈ రోజు(డిసెంబర్ 24)న విడుదల అవుతోంది. ఈ చిత్రం కథ విషయానకి వస్తే...నచ్చితే చెరకు గడ, నచ్చకపోతే రగడ...అనే రకం సత్య రెడ్డి (నాగార్జున). కడప మార్కెట్ యార్డ్ అతని అడ్డా. మాట తీరులో కొంచెం పొగరు కనిపించినా, మనిషి మాత్రం మాంచి సరదా. కడప మార్కెట్ యార్డులో అతని కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. ఆ సంఘటనతో హైదరాబాద్ చేరుకొంటాడు. ఆ అన్యాయం చేసిన వాడిపై సత్య ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. హైదరాబాద్ లో బుల్లెట్ లాంటి భామ శిరీష (అనుష్క), చాక్లెట్ లాంటి అష్టలక్ష్మి (ప్రియమణి) జత కలుస్తారు. ఈ ఇద్దరు ఎవరు? సత్య ఎందుకోసం హైదరాబాద్ వచ్చాడు? అతని ప్లాష్ బ్యాక్ ఏమిటీ...అక్కడేం జరుగుతుందనే విషయాలను తెరపైనే చూడాలి.
నాగార్జున సిగెరెట్ అంటించుకుంటూ లారీలోంచి ఓ నార్మల్ వ్యక్తిలా ఎంట్రీ ఇస్తాడు. అలాగే అనూష్క...శిరీషగా కనిపిస్తుంది. మన్మధుడా అంటూ ఛార్మి ఓ ఐటం సాంగ్ లో కనిపిస్తుంది. బ్రహ్మానందం..బ్రహ్మం అన్నగా కనిపిస్తాడు. బ్రహ్మానందం...ఈ హృదయం పాట బ్యాక్ డ్రాప్ లో అనూష్కకి లైన్ వేస్తూంటాడు. నాగార్జున వెంట అనుష్క పడితే, అనుష్కను బ్రహ్మానందం ఫాలో అవుతుంటాడు - ముక్కోణపు ప్రేమ అన్నమాట. అష్టలక్ష్మిగా ప్రియమణి, ఆమె సోదరుడుగా భరత్ ఎంటర్టైన్ చేస్తూంటారు. సెకెండాఫ్ లో ప్లాష్ బ్యాక్. అందులో నాగార్జున అనాధని, అతన్ని ఓ లేడి డాక్టర్ చేరతీసిందని ఆమెకు అన్యాయం జరిగితే సిటీకి బయలు దేరాడని తెలుస్తుంది. ఈ చిత్రం కోసం తొలిసారిగా నాగార్జున రాయలసీమ యాసలో మాట్లాడారు.
సంస్థ: శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్
నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రియమణి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, తనికెళ్ళ భరణి, రఘుబాబు, ప్రదీప్‌రావత్, దేవ్‌గిల్, సుప్రీత్, శ్రీలలిత, సన, మాస్టర్ భరత్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
దర్శకత్వం: వీరూ పోట్ల


Click it and Unblock the Notifications











