twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ‘రగడ’ చేసే రిలీజు డేట్ ఫిక్స్

    By Srikanya
    |

    నాగార్జున, వీరూపోట్ల కాంబినేషన్ లో రెడీ అయిన రగడ చిత్రం డిసెంబర్ 23 న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డి మీడియాకు కన్ఫర్మ్ చేస్తూ...'ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మా సంస్థలో 'రగడ" మరో మ్యూజికల్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్రేక్షకులు, అభిమానులు మా చిత్రాన్ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నామని నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో నాగార్జున సరసన అనూష్క, ప్రియమణి నటించారు. తమన్ సంగీతం అందించిన సంగీతం మొన్న సోమవారం విడుదల అయింది.

    ఇక ఈ చిత్రంలో నాగార్జున...'నాది..కడప. నచ్చితే చెరుగ్గడ. నచ్చకపోతే రగడ' అని చెప్పే డైలాగు హైలెట్ అవుతుందంటున్నారు. అలాగే ఈ చిత్రం గురించి..."నాకు సినిమా మీద గట్టి నమ్మకం. సినిమాల్లోకి వచ్చి ఇరవై ఐదేళ్లు అవుతోంది. ఈ మధ్యకాలంలో హిట్టు కొట్టలేదనే బాధ, ఉక్రోషంలోంచి 'రగడ' పుట్టుకొచ్చింది. 'రగడ' అంటే ఏమిటో ఆంధ్రదేశానికంతా తెలుస్తుంది. రగడ టైటిల్‌కు తగ్గట్టుగా వసూళ్లపరంగా రగడ సృష్టిస్తుందీ సినిమా అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X