యాభైరోజులు పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున చెరుకుగడ సినిమా...
కింగ్ నాగార్జున నటించిన చిత్రం 'రగడ". అనుష్క, ప్రియమణి నాయికలుగా నటించిన ఈ చిత్రానికి వీరు పోట్ల దర్శకత్వం వహించారు. కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలై ఈ శుక్రవారంతో (నేటికి) యాభై రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ '' ఈ సినిమాలో పాటలు, పోరాట దృశ్యాలు, సంభాషణలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ 'రగడ" కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 89 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకోవడం, అదే రోజున 'దిల్" రాజు సంస్థలో చేసిన గగనం విడుదల అవడం, ఇదే నెల 12న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థలో శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో 'ఢమరుకం" షూటింగ్ ప్రారంభం అవుతుండటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.
'రగడ" చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను"" అన్నారు. నిర్మాత శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ''క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం భారీ ప్రారంభ వసూళ్లు సాధించింది. సంక్రాంతి పండగకు కూడా మంచి వసూళ్లను రాబట్టి ఇప్పుడు శివరాత్రి వరకు కూడా జైత్రయాత్రను కొనసాగించడం ఆనందంగా వుంది"" అని తెలిపారు.


Click it and Unblock the Notifications











