నచ్చితే చెరుగ్గడ. నచ్చకపోతే రగడ: నాగార్జున
నన్ను ఎక్కడనుంచి వచ్చావని అడిగినే 'కడప. నచ్చితే చెరుగ్గడ. నచ్చకపోతే రగడ' అంటా. అంటూ నాగార్జున తన తాజా చిత్రం ఆ తర్వాత నాగార్జున 'రగడ' లోని డైలాగుని చెప్పారు. శిల్పకళావేదికలో అక్కినేని అభిమానుల మధ్య వైభవంగా జరిగిన 'రగడ' ఆడియో వేడుక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే మాట్లాడేటప్పుడు ఒకానొక సమయంలో తీవ్రమైన భావోద్వేగానికి గురైన ఆయన కొన్ని క్షణాలు మాట్లాడకుండా ఉండిపోయారు. ఆ తర్వాత "సినిమా మీద గట్టి నమ్మకం. అందుకే (చొక్కా) కాలర్ లేపా. నేను సినిమాల్లోకి వచ్చి ఇరవై ఐదేళ్లు అవుతోంది.(ఈ మధ్యకాలంలో) హిట్టు కొట్టలేదనే బాధ, ఉక్రోషంలోంచి 'రగడ' పుట్టుకొచ్చింది. నాన్నగారు 'రగడ' అంటే తెలియదన్నారు. 'రగడ' అంటే ఏమిటో ఆంధ్రదేశానికంతా తెలుస్తుంది. రగడ టైటిల్ కు తగ్గట్టుగా వసూళ్లపరంగా రగడ సృష్టిస్తుందీ సినిమా అన్నారు. అలాగే నాకు ఇద్దరు కొడుకులన్న విషయం తెలిసిందే...ఇంకా ఇద్దరు పుట్టినా నా గ్లామర్ లో మార్పురాదు. ఇలాగే ఉంటా అని చెప్పి అభిమానులను ఆనంద పరిచారు. ఇక ఈ ఆడియో సీడీని డా.అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించి, తొలిప్రతిని నాగార్జునకు అందించారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ...'రగడ' అనే టైటిల్ నాకు ఆశ్చర్యకరంగానూ, గొడవగానూ ఉంది. అభిమానుల కోసమే ఈ పేరు పెట్టారు. అలాగే మా కుటుంబంలో ఆరుగురు హీరోలున్నారు. మీ అభిమానం వంశపారంపర్యంగా చెక్కుచెదరకుండా వస్తోంది అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











