అన్యాయాలని సహిచలేకే 'రగడ' చేస్తున్న నాగార్జున

By Srikanya

మార్కెట్ యార్డ్‌లో పనిచేసే హీరో అన్యాయాలను అసలు సహించడు.ఎదురుతిరిగి రగడ రగడ చేస్తాడు. ఎక్కువ మంది విలన్లు కనిపిస్తారు. యాక్షన్ సన్నివేశాలు అలరిస్తాయి. ఛార్మి ఓ ప్రత్యేక పాటకు నర్తించింది. అభిమానులందరూ కలిసి పైరసీని అరికట్టే ప్రయత్నం చేయాలి అని నిర్మాత శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. నాగార్జున హీరోగా, అనుష్క, ప్రియమణి కాంబినేషన్ లో రెడీ అయిన చిత్రం 'రగడ'. వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా నిర్మాత మీడియాతో చిత్ర విశేషాలను వివరిస్తూ మాట్లాడారు.

ఇక ఈ చిత్రంలో నాగార్జున...'నాది..కడప. నచ్చితే చెరుగ్గడ. నచ్చకపోతే రగడ' అని చెప్పే డైలాగు హైలెట్ అవుతుందంటున్నారు. అలాగే ఈ చిత్రం గురించి..."నాకు సినిమా మీద గట్టి నమ్మకం. సినిమాల్లోకి వచ్చి ఇరవై ఐదేళ్లు అవుతోంది. ఈ మధ్యకాలంలో హిట్టు కొట్టలేదనే బాధ, ఉక్రోషంలోంచి 'రగడ' పుట్టుకొచ్చింది. 'రగడ' అంటే ఏమిటో ఆంధ్రదేశానికంతా తెలుస్తుంది. రగడ టైటిల్ ‌కు తగ్గట్టుగా వసూళ్లపరంగా రగడ సృష్టిస్తుందీ సినిమా అంటూ కాన్ఫిడెంట్ వ్యక్తం చేసారు.

అలాగే ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలకు చాలా మంచి స్పందన వస్తోందని చెప్తున్నారు. పాటలు బాగున్నాయని చాలా మంది ఫోన్లు, ఎస్సెమ్మెస్ ‌లు చేస్తున్నారని నిర్మాత అంటున్నారు. ఈనెల 23న అత్యధిక ప్రింట్లతో 'రగడ'ను విడుదల చేస్తున్నారు. చిత్రంలో నాగార్జున రాయలసీమ భాషలో మాట్లాడతారు..బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, రఘుబాబు,ప్రదీప్ రావత్, దేవ్ గిల్, సుశాంత్ సింగ్, సత్యప్రకాష్, సుప్రీత్, శ్రావణ్, డాక్టర్ భరత్‌రెడ్డి, రఘు, మాస్టర్ భరత్ ముఖ్య తారాగణమైన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: డి. విశ్వచందన్‌రెడ్డి, డి.వెంకటకైలాష్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీరు పోట్ల., థమన్ ఎస్. సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X