రాయలసీయ యాస ద్వారా రగడ సృష్టిస్తామంటున్న మన్మధుడు..
యాభై ఏళ్ళ వడిలోనూ నవయువ మన్మథుడిలా కనిపిస్తున్న మన 'కింగ్' నాగ్ చేసిన విభిన్న పాత్రలు మరెవరూ చేయలేదనే చెప్పుకోవాలి. ఒక 'గీతాంజలి', ఒక 'శివ', ఒక 'హలోబ్రదర్', ఒక 'అన్నమయ్య'.. ఇలా ఆయన నటించిన చిత్రాలను పరిశీలిస్తే నాగ్ అభిరుచి ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. ఒక గాఢ ప్రేమికుడుగా, ఒక యూత్ హీరోగా, హీరోయిజంలోనే కామెడీ పండించే హీరోగా, ఒక భక్తుడిగా ఇలా అన్నిరకాల పాత్రలు ధరించి ఒక ఆర్టిస్టు కుండే ఆత్మసంతృప్తిని తీర్చుకున్నారు. అయినా నిత్యకృషీవలుడుగా విభిన్న పాత్రలు పోషిస్తున్న నాగ్ త్వరలో 'రగడ' చిత్రం ద్వారా రాష్ట్రంలో రగడ సృష్టించనున్నారు.
మొదటిసారిగా రాయలసీమ యాసలో కనువిందు చేయనున్నారు కింగ్ నాగ్. అందాల భామలు అనుష్క, ప్రియమణిలు నాగ్ సరసన నటించారు. వీరు పోట్లదర్శకుడు. శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజస్ పతాకంపై డి.శివప్రసాద్‌రెడ్డి 'రగడ'ను నిర్మించారు. ఆడియోతో ఇప్పటికే అదరగొట్టేస్తున్న 'రగడ' డిసెంబర్ 23న పూర్తిస్ధాయిలో 'రగడ' చేయనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా 'కింగ్' నాగ్‌తో ఇంటర్వ్యూ విశేషాలు తెలుసుకుందాం..
ప్రశ్న: మొదటిసారిగా రాయలసీమ శ్లాంగ్‌లో చేస్తున్నారు. ఆ యాసపై మీకు పట్టుందా? జ: అప్పుడప్పుడు వింటుంటాం కానీ అంతగా అవగాహన లేదు. సెట్స్‌లో అయితే రాయలసీమ యాసపై బాగా పట్టున్న ఒక వ్యక్తిని పక్కనే వుంచుకునే వాడిని. ఆయన ద్వారా నేర్చుకుని అనుకరించే వాడిని. వెరైటీగా వుండే ఆ యాస నాకు చాలా బాగా నచ్చింది.
ప్రశ్న: పాటల్లో మీకు బాగా నచ్చిన పాట? జ: 'రగడ రగడ' చాలా బాగా నచ్చింది. అన్ని పాటలు మంచి ఊపున్నవే. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు బయట 'రగడ' పాటలు రగడ చేస్తున్నాయనే చెప్పాలి.
ప్రశ్న: 'రగడ'లో యాక్షన్ సీక్వెన్స్ గురించి? జ: ముఖ్యంగా యాక్షన్‌లో కూడా కమర్షియల్ సినిమా ఇది. వీరు పోట్ల, విజయ్ మాస్టార్ చాలా కొత్తగా కంపోజ్ చేశారు. సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్‌ని కొత్తరకంగా కట్ చేశారు. సూపర్బ్.
ప్రశ్న: దర్శకుడు వీరు పోట్ల గురించి? జ: మంచి టెక్నీషియన్. జూలై చివరి వరకు షూటింగ్ మొదలుపెట్టి నవంబర్‌లో ఫినిష్ చేశామంటే అతని వర్క్ డెడికేషన్‌ని మెచ్చుకోవచ్చు. ముందు సినిమా హిట్టా, ఫ్లాపా అని కాకుండా అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్‌లో తీశామన్నదే ముఖ్యం. ఆ పని వీరు చేశారు. అలాగే వీరు పోట్ల డైరెక్ట్ చేసిన 'బిందాస్'లో అతని స్క్రీన్‌ప్లే డైలాగ్స్ కొత్తగా ఆకట్టుకుంటాయి. అందుకే అతన్ని సెలక్ట్ చేసుకున్నాను. 'రగడ'లో కూడా అద్భుతమైన డైలాగ్స్‌తో పాటు మంచి స్క్రీన్‌ప్లేని అందించాడు. నిర్మాతల దర్శకుడు అతను అంటూ తన మనసులోని కోన్ని భావాలను రగడ గురించి పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











