రాజన్న రాకపోతే మహేష్ ‘దూకుడు’ బంగారు బాటే..!
అక్కినేని నాగార్జున నటిస్తున్న రాజన్న చిత్రం సెప్టెంబర్ 30న విడుదల అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు తాజా వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తుండగా, రాజమౌళి స్వయంగా పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రం లో సాంకేతిక విలువలు, పోరాట సన్నివేశాలు అత్యంత కీలకమైనవి కావటం తో, చిత్రంలో కాస్త జాప్యం జరుగుతోందని తెలిసింది. సెప్టెంబర్ 30న విడుదల కాకపోతే ఇక అక్టోబర్ మూడవ వారం తరువాత విడుదల అవుతుందని తెలిసింది. ఇదే గనక జరిగితే ఇక మహేష్ బాబు నటించిన దూకుడు చిత్రానికి బంగారు బాట పడినట్టే. దూకుడు సెప్టెంబర్ 23న విడుదల అవుతుండటంతో ఇక ఏకంగా రెండు వారాల పాటు ఎదురులేకుండా ప్రదర్శింప బడుతుంది. అక్టోబర్ 6వ తేదీన ఊసరవెల్లి విడుదల అయ్యే వరకు దూకుడు హావ నడవటం ఖాయం.


Click it and Unblock the Notifications











