'రాజన్న' ప్రీమియర్ షో టాక్ ఏంటి?
నాగార్జున, స్నేహ కాంబినేషన్ లో రూపొందిన రాజన్న చిత్రం ప్రీమియర్ షో నిన్న(మంగళవారం)రాత్రి వేయటం జరిగింది. ఈ చిత్రం చూసిన వారు ఇనానమస్ గా హిట్ అని చెప్తున్నారు. ఎమోషనల్ గా ఈ చిత్రం కట్టిపారేస్తోందని,రాజమౌళి చిత్రీకరించిన సన్నివేసాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు. రీసెంట్ గా నాగార్జున చిత్రాలేవీ భాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోలేదు. కేవలం ఓపినింగ్స్ తెచ్చుకుని యావరేజ్ వద్ద సెటిలవుతున్నాయి. అయితే రాజన్న మాత్రం హిట్ అవుతుందని, నాగార్జున కెరీర్ లో మరోసారి బ్రేక్ వచ్చినట్లు అని అంటున్నారు.
ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్, నాగార్జున ఎంట్రీ సీన్స్ చాలా బాగా వచ్చాయని, నైజాం ప్రాంతంలో ఈ చిత్రం కొత్త రికార్డులు క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుతున్నారు. సెకండాఫ్ కొద్దిగా పెద్దదైంది అనిపించినప్పటికీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ వచ్చే ఎమోషన్ గ్రాఫ్ ఆ ఫీల్ ని కలగనీయకుండా గట్టెక్కిస్తుందని చెప్తున్నారు. ఇక నాగార్జున సైతం ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
తమ అన్నపూర్ణ బ్యానర్ పై తీసిన ఈ చిత్రం తన కెరీర్ లో మరో మైలు రాయిలా నిలబడుతుందని ప్రారంభమైన నాటి నుంచి నాగార్జున చెప్తూ వస్తున్నారు. అదే నిజమైంది అని చెప్తున్నారు. సంవత్సరం చివరలో వచ్చే ఈ చిత్రం ఈ సంవత్సరం ఎక్కువ కలెక్టు చేసే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











