నాగార్జున లేకుండా 'రాజన్న' షూటింగ్ ప్రారంభం
నాగార్జున హీరోగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ డైరక్ట్ చేస్తున్న "రాజన్న" చిత్రం షూటింగ్ రాజమండ్రిలో మొదలైంది. అయితే హీరో నాగార్జున లేని సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.అయితే కేవలం హీరో సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో కనిపిస్తాడని అందుకే నాగార్జున లేని సీన్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించే ఈ చిత్రం తెలంగాణ నేఫద్యంలో రజాకార్ల ఉద్యమం నేపధ్యంలో జరుగుతంది. అలాగే పీరియాడిక్ గా నాగార్జున చేస్తున్న ఎపిసోడ్ ఉంటుందని యాక్షన్ ప్రధానంగా రూపొందుతుందని సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రంలో విజయశాంతి నటించనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో కామాక్షి ఎంటర్ ప్రైజస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. అనుష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అలాగే శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే సోషియో ఫాంటసీ చిత్రం కూడ త్వరలో ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











