ఆ వార్తలను కొట్టిపడేసిన వర్మ... నమ్ముకున్న నిజం కోసం...
Recommended Video

తెలుగు సినిమా చరిత్రలో 'శివ' సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. యాక్షన్ థ్రిల్లర్ గా మే 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సొంత బ్యానర్ కంపెనీపై ఈ సినిమాను నిర్మించడం జరిగింది.

నమ్ముకున్న నిజం కోసం
అక్కినేని హీరో నాగార్జున ఆఫీసర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. నాగార్జున తన పాత్ర గురించి మాట్లాడుతూ సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఇందులో నాది ముక్కుసూటిగా, నిజాయితీ ఉంటూ నమ్ముకున్న నిజం కోసం పోరాడే మనిషి పాత్రలో కనిపించబోతున్నానని చెప్పడం జరిగింది.

మైండ్ పెట్టి తీశాను.
ఆఫీసర్ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఈ సినిమాను నేను మనసు పెట్టి తీయలేదు, మైండ్ పెట్టి తీశాను. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది . ''ఆఫీసర్ సినిమాను వేరే భాషలో వచ్చిన టేకెన్ సినిమాను ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా చేశాను అన్నారు. కాని వార్తలో నిజం లేదు. సినిమా విడుదల తరువాత మీకే తెలుస్తోంది'' అన్నారు

ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో
నాగార్జున సరసన మైరా సరీన్ హీరోయిన్ గా కనిపించనుంది. నాగార్జున, వర్మల హిట్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు కూడ భారీ స్థాయిలోనే ఉన్నాయి. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులు ఆగాల్సిందే
వర్మ నుంచి ఈ మధ్యకాలంలో హిట్ చిత్రం రాలేదు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఈమధ్య పెద్దగా సక్సెస్ కాలేదు. ఆఫీసర్ సినిమా తనకు మంచి విజయం సాధించి పెడుతుందని భావిస్తున్నాడు వర్మ. నాగార్జున కూడా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నాడు. మరి ఆఫీసర్ సినిమా వీరిద్దరి నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











