నాగ్ సీక్రెట్ అదే: రానా, మంచు లక్ష్మి కూడా...(ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడిగా పేరొందిన అక్కినేని నాగార్జున్ 54 ఏళ్ల వయసులోనూ నవ యవ్వనంతో నవనవలాడున్న సంగతి తెలిసిందే. తాను ఇలా యవ్వనంగా కనిపించడానికి కారణం ఏమిటనే సీక్రెట్ నాగార్జున వెల్లడించారు. డాక్టర్ రష్మి చెప్పే టిప్స్ పాలో అవ్వడం వల్లనే తాను ఇలా ఉన్నానని ఆయన తెలిపారు. డాక్టర్ రష్మి శెట్టి చాలా కాలంగా నాగార్జునకు బ్యూటీ కన్సల్టెంటుగా ఉన్నారు.
రష్మి రాసిన 'ఏజ్ ఎరేజ్' బుక్ ఆవిష్కరణ సందర్భంగా నాగార్జున ఈ విషయం వెల్లడించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నాగార్జునతో పాటు టాలీవుడ్ స్టార్స్ రానా, మంచు లక్ష్మి కూడా హాజరయ్యారు.
డాక్టర్ రష్మి శెట్టి రచించిన 'ఏజ్ ఎరేజ్' పుస్తకం గురించి మంచు లక్ష్మి, రానా మాట్లాడుతూ ఈ పుస్తకంలో పురుషులు, మహిళలు అందాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనే అంశాలను పొందు పరిచారని, అందరికీ ఈ పుస్తకం ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని తెలిపారు.

ఏజ్ ఎరేజ్ పుస్తకావిష్కరణ
ఏజ్ ఎరేజ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున, మంచు లక్ష్మి, రానా.

డాక్టర్ రష్మి శెట్టి
డాక్టర్ రష్మి శెట్టి ఈ పుస్తకాన్ని రచించారు. ఆమె గత కొంతకాలంగా నాగార్జునకు బ్యూటీ కన్సల్టెంటుగా ఉంటున్నారు.

మంచు లక్ష్మి
అందాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ రష్మి శెట్టి దగ్గరికి వచ్చే వారిలో మంచు లక్ష్మి కూడా ఒకరు.

రానా
ఏజ్ ఎరేజ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నటుడు రానా


Click it and Unblock the Notifications











