చిరు, సచిన్, పవన్, మహేష్‌లతో...నాగ్ (రేర్ ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : 54 ఏళ్ల వయసులోనూ మన్మధుడిలా నవనవలాడుతూ యువ హీరోలకు పోటీ ఇస్తూ ఇప్పటికీ బాక్సాఫీసు రేసులో తన సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు అక్కినేని నాగార్జున. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 1959 ఆగష్టు 29న జన్మించిన నాగార్జున మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు.

అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు. గీతాంజలి సినిమాతో మొదలైన ఆయన ప్రయోగాల పర్వం నేటికి కొనసాగుతుంది. శివ సినిమాతో తెలుగు సినిమా స్థితి గతులనే మార్చారు ఆయన. అయన ఇప్పటికీ కొత్త దర్శకులని, కొత్త కాన్సెప్ట్ లని బాగా ఎంకరేజ్ చేస్తారు.

యాక్షన్, లవ్ స్టొరీ సినిమాలే కాదు భక్తిరసమైన సినిమాలు చేసి కూడా మెప్పించగలనని నిరూపించారు ఆయన. కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన అన్నమయ్య ఆయన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. శ్రీ రామదాసు పాత్రలో, షిరిడి సాయి పాత్రల్లో కూడా అటు విమర్శకుల ప్రశంసల్ని ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.

ఇండస్ట్రీలోని అందరి హీరోలతో నాగార్జున మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. వారితో కలిసి దిగిన నాగార్జున రేర్ ఫోటోలతో ఆయన ఫ్యామిలీ రేర్ పిక్చర్స్ స్లైడ్ షోలో....

1. టాలీవుడ్ టాప్ స్టార్స్

1. టాలీవుడ్ టాప్ స్టార్స్

టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లను ఇక్కడున్న దృశ్యంలో చూడొచ్చు.

 2. హిట్ కాంబినేషన్

2. హిట్ కాంబినేషన్

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్స్ హిట్ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘శివ' చిత్రం పెద్ద హిట్టయింది. చిరంజీవి-శ్రీదేవి కలిసి నటించిన ‘జగదేక వీరుడు అతిలోకి సుందరి' చిత్రం కూడా భారీ హిట్టయింది. వర్మ-వెంకీ-శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ‘క్షణ క్షణం' కూడా హిట్టే.

 3. చిరంజీవి-నాగార్జున

3. చిరంజీవి-నాగార్జున

చిరంజీవి, నాగార్జున మధ్య సినిమాల పరంగా ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఉంది. అదే సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వాళ్లు ఎంత ఆత్మీయంగా పలకరించుకుంటారో ఈ ఫోటోలో చూడొచ్చు.

4. నాగార్జున ఫ్యామిలీ

4. నాగార్జున ఫ్యామిలీ

అక్కినేని నాగార్జున తన భార్య అమల, పెద్ద కుమారుడైన అక్కినేని నాగ చైతన్య, రెండో కుమారుడైన అక్కినేని అఖిల్ లతో కలిసి దిగి ఫోటో.

5. మాస్టర్‌తో మన్మధుడు

5. మాస్టర్‌తో మన్మధుడు

ప్రముఖ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూలర్క్‌తో కలిసి టాలీవుడ్ మన్మధుడు కలిసి దిగిన ఫోటో. సచిన్‌తో నాగార్జునకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఐబీఎల్ టోర్నీలో ముంబై టీంను కొనుగోలు చేయడంతో నాగార్జున, సచిన్ మరింత క్లోజ్ అయ్యారు.

6. మెగాస్టార్, ప్రిన్స్‌తో కింగ్

6. మెగాస్టార్, ప్రిన్స్‌తో కింగ్


ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ప్రిన్స్ మహేష్ బాబుకు అవార్డు అందిస్తున్న దృశ్యాన్ని ఈ ఫోటోల చూడొచ్చు.

7. ఈవివి, ఎస్వీ కృష్ణారెడ్డిలతో..

7. ఈవివి, ఎస్వీ కృష్ణారెడ్డిలతో..


టాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈవీవీ సత్యనారాయణ మరియు ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డిలతో కలిసి కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్...

8. అక్కినేని

8. అక్కినేని

అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఫ్యామిలీతో పాటు, కూతుర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో. ఇందులో ఏఎన్ఆర్ వారసులుగా నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుశాంత్ తెరంగ్రేటం చేసారు.

9. ముచ్చటైన జంట

9. ముచ్చటైన జంట

భార్య అమలతో పాటు అక్కినేని నాగార్జున. సినిమాల్లో కలిసి నటించిన వీరు ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఫోటోలో వారు ఎంతో రొమాంటిక్‌గా ఉన్నారు కదూ...!

10. టాలీవుడ్ అగ్రహీరోలు

10. టాలీవుడ్ అగ్రహీరోలు

మెగా స్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగార్జున. టాలీవుడ్‌ను పోటా పోటీగా ఏలిన నలుగురు అగ్ర హీరోలు.

11. నాగార్జున రేసింగ్ టీం

11. నాగార్జున రేసింగ్ టీం

మహేంద్ర సింగ్ ధోనికీ సంబంధించిన మహి బైక్ రేసింగ్ టీంలో కింగ్ నాగార్జునకు కూడా భాగస్వామిగా ఉన్నారు. తమ టీంకు సంబంధించిన రేసర్‌తో నాగార్జున, ఆయన తనయుడు అఖిల్

 12. సినీయర్ ఎన్టీఆర్‌తో

12. సినీయర్ ఎన్టీఆర్‌తో

సీనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ పార్వతిలతో కలిసి నాగార్జున. నాగార్జున తనయుడు సిసింద్రీ అఖిల్‌‌...ఎన్టీఆర్ దంపతులతో కలిసి ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

13. సీసీఎల్ టోర్నీలో

13. సీసీఎల్ టోర్నీలో

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో నాగార్జున టీంలో ఆయన తనయుడు అఖిల్ కూడా ఆడి అదరగొట్టాడు. కొడుకు ప్రొత్సహిస్తూ బరిలోకి దింపుతున్న నాగార్జునను ఇక్కడ దృశ్యంలో చూడొచ్చు.

14. ఏఎన్ఆర్ ఫ్యామిలీ

14. ఏఎన్ఆర్ ఫ్యామిలీ

అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ. నాగేశ్వరరావు కొడుకు నాగార్జున ఫ్యామిలీతో పాటు, కూతుర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో. ఇందులో ఏఎన్ఆర్ వారసులుగా నాగార్జున, సుమంత్, నాగ చైతన్య, సుశాంత్ తెరంగ్రేటం చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X