twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజీ సినిమా దిశగా నాగ చైతన్య.. నాగార్జున ఇన్వాల్వ్ అయింది అందుకే!

    |

    అక్కినేని నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం వినాయక చవితి సందర్భంగా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఓ వైపు మంచి రెస్పాన్స్ వస్తున్నా, కొంత డివైడ్ టాక్ కూడా ఉంది. శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో ఏస్థాయిలో విజయం సాధిస్తుందో తెలియాలంటే ఏ వీకెండ్ ముగిసేవరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా నాగచైతన్య మరో క్రేజీ చిత్రం దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    అప్పట్లో బంపర్ హిట్

    అప్పట్లో బంపర్ హిట్

    2002 లో విడుదలైన మన్మథుడు చిత్రం కింగ్ నాగార్జున బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. నాగార్జునకు లేడీస్ ఫాలోయింగ్ ఈ చిత్రంతో రెట్టింపైంది. త్రివిక్రమ్ మాటలు, విజయ్ భాస్కర్ దర్శత్వం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలు.

    దేవిశ్రీ సంగీతం

    దేవిశ్రీ సంగీతం

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అయితే యువతని ఒక ఊపు ఊపింది. లవర్ బాయ్ గా నాగ్ నటన అదుర్స్. అలాంటి మన్మథుడుకు సీక్వెల్ రెడీఅవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    చైతు కోసం

    చైతు కోసం

    అందాల రాక్షసి చిత్రంతో హీరోగా పరిచయమై, ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారాడు. తొలి ప్రయత్నంలోనే ప్రతిభ కలిగిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగ చైతన్య కోసం రాహుల్ ఓ కథని సిద్ధం చేశాడట.

    నాగార్జున జోక్యం

    నాగార్జున జోక్యం

    చైతు కోసం సిద్ధం చేసిన కథని నాగార్జున విన్నట్లు తెలుస్తోంది. కథలో మన్మథుడు చిత్ర పోలికలు ఉండడంతో ఈ చిత్రానికి మన్మథుడు 2 టైటిల్ పెట్టమని సూచించినట్లు తెలుస్తోంది. శైలజారెడ్డి అల్లుడు చిత్ర ప్రమోషన్ లో భాగంగా నాగ చైతన్య ఈ విషయాన్ని వివరించాడు.

     మన్మథుడు2 టైటిల్

    మన్మథుడు2 టైటిల్

    కథ విన్న వెంటనే నాగార్జున మన్మథుడు2 టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు చైతు తెలిపాడు. బ్లాక్ బస్టర్ చిత్రణకి సీక్వెల్ అంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కథ పక్కాగా సిద్ధం అయిన తరువాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Nagarjuna registered Manmadhudu 2 title for Naga Chaitanya. Rahul Ravindran will going to direct this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X