twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ ఏమిటిదీ..? అప్పట్లో వర్మ రమ్మంటే వెళ్ళలేదు సరే..! ఇప్పుడు వెళ్తే ఎలా..??

    |

    తెలుగునుంచి బాలీవుడ్ కి వెళ్ళిన నటుల్లో హీరోయిన్లు తప్ప హీరోలు పెద్దగా సక్సెస్ అవలేక పోయారు. మీసాలున్న హీరోలు పెద్దగా నచ్చకో ఏమో హిందీ ప్రేక్షకులకి మన హీరోలు అప్పట్లో నచ్చలేదు. అయితే కనీసం ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నాగార్జున ఒక్కడే అని చెప్పుకోవాలి. మనదగ్గర చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ బాలీవుడ్ లో లేదు కానీ నాగార్జునని మాత్రం హిందీ పరిశ్రమ లోనూ, ప్రేక్షకుల్లోనూ కొంత గుర్తింపు ఉంది. శివ టైమ్‌ లొనే నాగ్ కి కొంత ఫాలోయింగ్ ఏర్పడింది.

    అప్పట్లోనే రామ్‌ గోపాల్‌ వర్మ తనను బాలీవుడ్‌కు వచ్చేయమన్నా తాను తిరస్కరించానని చెప్పాడు నాగార్జున. తెలుగు సినిమాలు చేయడంలో నాకు సంతృప్తి ఉన్నందుకే అలా ఆలోచించాను. గతంలో హిందీ సినిమాలు చేశాను. ఇప్పుడు కూడా ఏవైనా ఆసక్తికర పాత్రలు ఆఫర్‌ చేస్తే హిందీలో చేయడానికి అభ్యంతరమేమీ లేదు... అని హిందీ పరిశ్రమ మీద ఉన్న ఆసక్తిని మళ్ళీ ఒక సారి చెప్పకనే చెప్పాడు.

    Nagarjuna Reject Ram Gopal Varma Bollywood Offer

    ఊపిరి లో చేసిన పాత్ర లాంటి పాత్ర నాగ్ కి ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే నిజానికి ఒక డీగ్లామరైజ్ అనే చెప్పాలి కానీ... ఒక ప్రయోగం లా ఉంటుందనీ ఒకే చెప్పాడట. అసలు నాగార్జున తప్ప మరెవరూ చేయలేరన్నంత గా ఆ పాత్రకి ప్రాణం పోసాడు నాగ్. "మన్మదుడు" ఇమేజ్ కి ఏదైనా భంగం కలుగుతుందేమో అనుకున్నా.. ఊపిరి నాగ్ కెరీర్లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. గత కొన్నేళ్లలో వైవిద్యమైన పాత్రలు.. క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తుండటానికి కారనం కూడా అమితాబ్‌ బచ్చనే స్ఫూర్తి అట.

    ''మనం కంటే ముందే ఇకపై మొనాటనీ బ్రేక్‌ చేస్తూ వైవిద్యమైన పాత్రలు ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడట. "పాత్ర బాగుంటే సపోర్టింగ్‌ రోల్స్‌ కూడా చేయాలనుకున్నా.ఆ క్రమంలోనే మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి లాంటి సినిమాలు వచ్చాయి.నేను అమితాబ్‌ బచ్చన్‌కు వీరాభిమానిని. గత కొన్నేళ్లగా వయసుకు తగ్గట్లుగా చాలా మంచి పాత్రలు ఎంచుకున్నారాయన. ఆయన సపోర్టింగ్‌ రోల్స్‌ చేసినా మెయిన్‌ హీరోలాగే కనిపిస్తారు. నేను ప్రస్తుతం ఎంచుకుంటున్న పాత్రలకు కూడా ఆయనే స్ఫూర్తి.ఆయన లాగే అర్థవంతమైన పాత్రలు, సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను'' అని అన్నాడు

    English summary
    "When Ram Gopal Varma is shifting to Mumbai completely, he asked me to come there. But I've rejected the idea as Telugu films are prime to me." says Akkineni.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X