నాలుగేళ్లు పూర్తైన సంధర్బంగా.. నాగార్జున ఎమోషనల్ ట్వీట్!

అక్కినేని కుటుంబం మొత్తం చిరస్థాయిగా గుర్తుంచుకునే చిత్రం 'మనం'. ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం కూడా ఇదే. మనం చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నాలుగేళ్ళు. నాగార్జున, తన తండ్రి ఎన్నార్ తో కలసి అనేక చిత్రాల్లో నటించారు. అక్కినేని ఫ్యామిలి మొత్తం కలసి ఓ చిత్రంలో నటించాలని నాగార్జున భావిస్తున్న తరుణంలో దర్శకుడు విక్రం కుమార్ మనం చిత్ర కథని వినిపించారు.
పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం 2014 లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. క్లాసికల్ హిట్ అని కుడా అభివర్ణించబడింది. ఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, సమంత ఈ చిత్రంలో నటించారు. శ్రీయ హీరొయిన్ గా నటించింది. అఖిల్ కామియో రోల్ పోషించాడు.
అన్ని పాత్రలని బ్యాలన్స్ చేస్తూ విక్రం కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. నాలుగేళ్ళు పూర్తైన సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా నాగార్జున ఏఎన్నార్ ని గుర్తు చేసుకున్నారు. మమ్మల్ని నవ్వించి, ఏడిపించి వెళ్ళిన మీగురించి ఎప్పుడూ అలోచిస్తుంటాం నాన్న అంటూ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











