నా కొడుకుని మోయండి..నాగార్జున
నా కుమారుడు నాగచైతన్యను మీ భుజాలపై మోసుకెళ్ళండి అంటూ నాగార్జున తన అభిమానులను అర్దించాడు. జోష్ ఆడియో పంక్షన్ లో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ ఎమోషనల్ గా ఈ విషయం చెప్పారు. "మా నాన్న, రామానాయుడుగారు ఇద్దరూ లివింగ్ లెజండ్స్. నేనూ, వెంకీ వాళ్లను అందుకోలేకపోయాం. చైతన్య మమ్మల్ని దాటుకుని వెళ్లి తన తాతలంతటి పేరు తెచ్చుకోవాలి. చైతూ నటన పట్ల తనకున్న ఆసక్తిని సరైన సమయంలో కనబరిచాడు. తనతో నేనే సినిమా తీద్దామనుకున్నాను.
కానీ దిల్‌రాజు మంచి కథతో ముందుకొచ్చారు. మూడు తరాలుగా మమ్మల్ని అభిమానిస్తున్న అభిమానులకు చైతన్యను అప్పగిస్తున్నా. మీ భుజాలపై మోసుకెళ్లండి" అన్నారు. నాగచైతన్య, కార్తిక జంటగా నటించిన చిత్రం 'జోష్'. దిల్ రాజు నిర్మాత. వాసు వర్మ దర్శకుడు. శాసనసభ స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తొలి సీడీని ఆవిష్కరించారు. అక్కినేని నాగేశ్వరరావు, డా.డి.రామానాయుడు సంయుక్తంగా అందుకున్నారు. క్యాసెట్ ను కె.రాఘవేంద్రరావు విడుదల చేసి మంచు మోహన్ బాబుకు అందజేశారు.


Click it and Unblock the Notifications











