గాల్లో కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చు, తప్పు చేస్తే శిక్ష తప్పదు: బిగ్‌బాస్ వివాదంపై నాగార్జున
నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న చిత్రం మన్మథుడు 2. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కొందరు బిగ్ బాస్ వివాదం గురించి, కేసుల గురించి ప్రస్తావించారు. దీనిపై నాగార్జున తనదైన శైలిలో స్పందించారు.

బిగ్‌బాస్ ఎక్స్‌పీరియన్స్ బావుంది
బిగ్‌బాస్ ఎక్స్‌పీరియన్స్ బావుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినపుడు కొంచెం బిగుసుకుపోయి కూర్చోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఏదంటే అది చేయొచ్చు. ఒక్క వీకెండ్ మాత్రమే అయింది. ఏం జరుగుతుందో చూడాలి... అని నాగార్జున తెలిపారు.

నేను వివాదాలకు దూరం, 15 దేశాల్లో బిగ్ బాస్
కాంట్రవర్సీలకు నేను ముందు నుంచి దూరంగానే ఉన్నాను. ఇపుడు కూడా అలాగే ఉన్నాను. బిగ్ బాస్ అనేది 15 దేశాల్లో ఉంది. హిందీలో 12 సీజన్లు, తమిళం 3 సీజన్స్, కన్నడ 2 సీజన్స్, మలయాళం 4 సీజన్స్, మరాఠీ 2 సీజన్స్... తెలుగులో ఇది 3వ సీజన్ రన్ అవుతోందనని నాగ్ స్పష్టం చేశారు.

కాంట్రవర్సీ అనేది గాల్లో నుంచి పుట్టించవచ్చు
కాంట్రవర్సీ అనేది గాల్లో నుంచి పుట్టించవచ్చు... బిగ్ బాస్ 3 విషయంలో జరుగుతున్న గొడవ గురించి నాకు తెలియదు. తెలంగాణ హైకోర్టు, తెలంగాణ పోలీసులు దీనిపై విచారణ చేయడం ఆనందంగా ఉంది. వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తారని నమ్ముతున్నాను. ఎవరైనా తప్పు చేస్తే వారిని తప్పకుండా శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను.... అని నాగార్జున అన్నారు.

ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి
నాకు బిగ్ బాస్‌లోకి ఎవరు వస్తున్నారనే చివరి వరకు తెలియదు. షో మొదలయ్యే కొంతసేపటి ముందు నాకు వారి గురించి చెప్పారు. ఈ షోలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అంతా ఒక పద్దతి ప్రకారం జరుగుతుందన్నారు. తన తర్వాతి సినిమా ‘బంగార్రాజు' ఇది అయిపోయిన తర్వాత మొదలు పెట్టాలి. కళ్యాణ్ కృష్ణ కథతో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications











