»   »  కొడుకు పెళ్లి గురించి నాగార్జున షాకింగ్ కామెంట్స్!

కొడుకు పెళ్లి గురించి నాగార్జున షాకింగ్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగార్జున తన కుమారుడు నాగ చైతన్య పెళ్లి విషయంలో స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నాగచైతన్యకు ఎలాంటి అమ్మాయి కావాలో అతనికే తెలియాలి. ఎవరి భార్యను వారే వెతుక్కోవాలి. నాగ చైతన్య కూడా తనకు కాబోయే భార్యను అతనే ఎంచుకోవాలి అంటూ సూచించాడు. ఎవరైనా అమ్మాయిని ప్రేమించానని చెబితే వెంటనే పెళ్లి చేయడానికి తాను రెడీ అని కూడా నాగార్జున చెప్పేశాడు.

నాగార్జున ఇలా అనడానికి కారణం.... తన జీవితంలో జరిగిన ఘటనే అంటున్నారు. చేసుకునే వారి ప్రమేయం లేకుండా పెద్ద కుదిర్చిన పెళ్లి సంబంధాలు ఎక్కువ కాలం నిలబడవు, ముఖ్యంగా సినిమా రంగంలో ఉండే వారికి ఇలాంటి అస్సలు సూటు కావు. ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, అలాంటి వారే పెళ్లయిన తర్వాత సుఖంగా ఉండగలరు అనేది నాగార్జున భావనగా కనిపిస్తోంది.

Nagarjuna responds on Naga Chaitanya's marriage

నాగార్జున మొదటి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం. ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు లక్ష్మిని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి కలిగిన సంతానమే నాగ చైతన్య. పలు కారణాలతో లక్ష్మితో నాగార్జున విడిపోయాడు. తర్వాత తన సహ నటి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయినా ఇపుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు దాదాపు అందరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారే. రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి కోగా.... అల్లు అర్జున్ స్నేహారెడ్డిని లవ్ చేసి పెళ్లాడాడు. మంచు మనోజ్, నాని ఇలా వీరంతా కూడా ప్రేమ పెళ్లి చేసుకున్న వారే.

English summary
Nagarjuna shocking comment on Naga Chaitanya's marriage.
Please Wait while comments are loading...