twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హల్లో కథను లీక్ చేసిన నాగ్.. మన్మథుడి స్ట్రాటేజీ అదేనా..

    By Rajababu
    |

    Recommended Video

    'హలో' స్టోరీ బయట పెట్టిన నాగ్ ! | Filmibeat Telugu

    అక్కినేని అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం హల్లో. మనం చిత్రానికి దర్శకత్వం వహించిని విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. అక్కినేని నాగార్జున నిర్మాత. ఈ చిత్రం డిసెంబర్ 22 రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగార్జున అక్కినేని మీడియా సమావేశంలో హల్లో చిత్రం గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

     డిఫరెంట్‌గా నాగార్జున ప్రమోషన్

    డిఫరెంట్‌గా నాగార్జున ప్రమోషన్

    టాలీవుడ్ హీరోల్లో కింగ్ నాగార్జున చేసినట్టుగా మూవీ ప్రమోషన్స్ ఎవరు చేయలేరేమో. సినిమా కరెక్ట్ కంటెంట్ ని ముందే చెప్పేసి సినిమాపై అంచనాలు పెంచుతుంటారు నాగ్.. ఎక్కువగా పొగడ్తలకు పోకుండా హైప్ చేయకుండా చాలా సింపుల్‌గా సినిమా ప్రమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ రెండవ సినిమా హల్లో ప్రమోషన్స్ ను కూడా నాగ్ అదే స్టైల్ లో కొనసాగిస్తున్నారు. తన చిన్న కొడుకు మూవీ ఈ సారైనా హిట్ కొడుతుందో లేదో అని లోలోపల టెన్షన్ ఉన్న ఈ సినిమా మీద చాలా నమ్మకం ఉందని చెప్పారు.

     హల్లో కథ ఇదే

    హల్లో కథ ఇదే

    హల్లో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా నాగార్జున మీడియాతో ముచ్చటించారు ఈ సందర్బంగా కథను బయటపెట్టేశాడు. చిన్నతనంలోనే మంచి స్నేహితులైన అబ్బాయి, అమ్మాయి విడిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి ఫొన్ నంబర్ ఇచ్చి వెళుతుంది. దాదాపు 15 సంవత్సరాలుపాటు హీరోయిన్‌కు హీరో ఫోన్ చేస్తుంటాడు. కానీ అమ్మాయి ఫోన్ ఎత్తదు. అందుకే ఆ సినిమాకు హల్లో టైటిల్ అని పెట్టాం అని నాగార్జున చెప్పారు.

     ఎమోషన్స్‌తో హల్లో

    ఎమోషన్స్‌తో హల్లో

    హల్లో చిత్రంలో ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో ఆనందభాష్పాలు రాలుతాయి. విడిపోయిన ప్రేమికులు ఎలా కలుసుకొంటారు. కలుసుకోవడానికి మధ్య ఏమి జరిగింది. ఈ చిత్రం ఒకరోజులో జరిగే కథ అంటే.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జరిగే కథ. స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉంటుంది. క్లైమాక్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. వారు కలుసుకోవాలని ప్రేక్షకులు అనుకొని ఉద్వేగానికి గురవుతారు. వారిని ఎలాగైనా కలుపు అని దేవుడిని వేడుకుంటాం.

     యాక్షన్ సీన్లు ఆసక్తిగా

    యాక్షన్ సీన్లు ఆసక్తిగా

    హల్లో చిత్రంలో యాక్షన్ సీక్వెన్స్ అద్బుతంగా ఉంటాయి. ఫైట్ సీక్వెన్స్ కోసం హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్‌ను రప్పించాం. కృష్ణానగర్‌లోని స్లమ్స్ ఇండ్లపై యాక్షన్ సీక్సెన్స్ ఉంటాయి. దాదాపు 30 రోజులపాటు ఫైట్స్‌ను చిత్రీకరించాం. ఇప్పటివరకు తెలుగు తెర మీద ఎవరూ చూసి ఉండరు. జాకీచాన్ తరహా ఫైట్స్ సీక్వెన్స్ ఉంటాయి.

     నాగార్జున న్యూ స్ట్రాటజీ

    నాగార్జున న్యూ స్ట్రాటజీ

    అయితే నాగార్జున ఈ విధంగా మూవీ స్టొరీని లీక్ చేయడం ఓ కొత్త స్ట్రాటేజీ అని చెబతున్నారు. కథపై ఆసక్తిని పంచడం ద్వారా అంచనాలు పెంచే ప్రయత్నం చేశారని సినీవర్గాలు అంటున్నాయి. సినిమాలో కొత్తదనం ఏముంది అని ప్రేక్షకులు ఆలోచిస్తున్న సమయంలో మంచి లైన్ చెప్పి సినిమా ఎలా నడుస్తుంది అనే ఆలోచనను కల్పించే ప్రయత్నం చేశాడు. మరి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ఈ హలో సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    Akhil Akkineni’s debut film may have turned out to be a dud at the box office but the Akkineni fans haven’t written him off as yet. Akhils upcoming film Hello which is due for release on December 22, to cash in on the long Christmas weekend. In this occassion Producer Nagarjuna Akkineni speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X