పవర్‌ఫుల్ లుక్ రావాలంటే పెంచాల్సిందే: నాగార్జునకు వర్మ సూచన

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున పోలీసుగా కనిపిస్తారని, పాత్ర కోసం కండలు పెంచుతున్నాడని సమాచారం.

By Bojja Kumar

రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో 'శివ' లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా రావడంతో మళ్లీ ఇద్దరి కాంబినేషన్ అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కొన్ని చెత్త సినిమాలు తీసినప్పటికీ ఇండియన్ సినిమా పరిశ్రమలోని గ్రేట్ డైరెక్టర్లలో వర్మ ఒకరు. ఆయన తన సినిమాలో క్యారెక్టర్లు డిజైన్ చేసే తీరు చాలా బావుంటుంది. ముఖ్యంగా తనకు కావాల్సిన విధంగా సినిమాలోని పాత్ర లుక్స్ విషయంలో ఎంతో పర్‌ఫెక్ట్‌నెస్ ఉండేలా వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

నాగార్జున‌ డిఫరెంట్ లుక్‌

నాగార్జున‌ డిఫరెంట్ లుక్‌

తన తాజా సినిమాలో నాగార్జునను డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నాడు వర్మ. ఇందుకోసం నాగ్‌ను కాస్త కండలు పెంచాలని సూచించాడట. ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

పవర్ ఫుల్ క్యారెక్టర్

పవర్ ఫుల్ క్యారెక్టర్

గతంలో వచ్చిన రక్షణ, శివమణి చిత్రాల్లో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. తాజా సినిమాలో కూడా నాగార్జున అదే ఇంటెన్స్ ఉన్న పోలీస్ గా కనిపించబోతున్నారని సమాచారం.

నవంబర్ 20 నుండి షూట్

నవంబర్ 20 నుండి షూట్

రామ్ గోపాల్ వర్మ స్వయంగా నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 20 నుంచి మొదలవ్వనుంది. "శివ" సినిమా మొదటి షాట్ ను షూట్ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ లోనే తాజా చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నారు.

అమ్మ, నాన్న ప్రస్తావనతో వర్మ పబ్లిసిటీ

అమ్మ, నాన్న ప్రస్తావనతో వర్మ పబ్లిసిటీ

తాను సినీ దర్శకుడిని అవుతాననే విషయాన్ని తన తండ్రి ఎన్నడూ నమ్మలేదని , అయితే, తన తొలి సినిమా అయిన 'శివ'కు తొలి క్లాప్ ను తన తండ్రితోనే కొట్టించానని... ఆ విధంగా ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నానని ఫేస్ బుక్ ఫేస్ బుక్ వర్మ ఇటీవల వ్యాఖ్యానించారు.

అమ్మతో క్లాప్ కొట్టిస్తాడట

అమ్మతో క్లాప్ కొట్టిస్తాడట

"మా అమ్మ కూడా నేను పెద్దగా ఏమీ సాధించని సాధారణ మనిషిగా ఉండి పోతానని భావించింది. అందుకే ఇప్పుడు నాగార్జునతో తీస్తున్న సినిమాకి ఆమెతో క్లాప్ కొట్టిస్తాను దానితో నా రివేంజ్ పూర్తవుతుంది. అంటూ తల్లితో తీసుకున్న చిన్న నాటి ఫొటోను పోస్టు చేశారు వర్మ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X