twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియా వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్...తీరుస్తా నీ కష్టం...?

    By Sindhu
    |

    'యే దిల్ మాంగే మోర్" అన్నట్లుగా ఎప్పటి కప్పుడు వైవిధ్యమైన చిత్రాలు, విభిన్నమైన పాత్రల కోసం తహ తహ లాడుతుంటారు కథానాయిక ప్రియమణి. గ్లామర్‌ తో పాటు అభినయాన్ని కూడా ప్రదర్శించగల అరుదైన నటీమణుల్లో ఈ తార ఒకరు. అందుకే ప్రియమణికి ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం వుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులకు కూడా ఈ ముద్దుగుమ్మ సుపరిచితురాలే. ఒకేసారి ఇన్ని భాషల్లో నటిస్తూ అందరి మన్నన్నలు పొందడటమంటే అంత ఈజీ కాదు. ఈ విషయం ప్రియకు కూడా తెలుసు. అందుకే చేసే పాత్రపై శ్రద్ధ పెట్టి ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు తను.

    కావునే ఆమె పోషించిన పాత్ర రక్తికట్టి ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ప్రస్తుతం తెలుగులో నాగార్జున సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు ప్రియమణి. వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఇటీవలే నాగ్‌ తో ఆమె పాల్గొనగా చిత్రీకరించారు. 'అష్టలక్ష్మీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్...తీరుస్తా నీ కష్టం" అనే పల్లవితో కొనసాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. తమన్ సంగీత దర్శకత్వంలో ఈ పాట రూపుదిద్దుకుంది. ఈ చిత్రం తన కెరీర్‌ లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా వుంటుందని ప్రియమణి భావిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X