Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున ‘భాయ్’ ఆడియో రిలీజ్ డేట్
ప్రస్తుతం 'భాయ్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించే సాంగు చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. డమరుకం తర్వత నాగార్జున నటించిన సినిమాలేవీ రాక పోవడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, అజయ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు.
నథాలియా 'భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.