twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ ‘భాయ్' లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    హైదరాబాద్ : యాక్షన్ కామెడీగా రూపొందుతున్న నాగార్జున తాజా చిత్రం 'భాయ్' . పూలరంగడు,అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఇటీవలే యూరప్‌లోని స్లోవేనియా, ఇటలీల్లో నాగార్జున, రిచా గంగోపాధ్యాయలపై బృంద నృత్య దర్శకత్వంలో రెండు పాటల్ని షూట్ చేసుకుని వచ్చింది.

    ఈ షెడ్యూల్ తో షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ నెల 28 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ మొదలవుతుంది. అన్నపూర్ణ స్టూడియోలో కోటీ యాభై లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఓల్డ్ సిటీ సెట్‌లో కీలక సన్నివేశాలను తీస్తారు.

    జూన్ నెలాఖరుకల్లా చిత్రీకరణ పూర్తి చేసి జూలైలో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీరభద్రం తనదైన శైలిలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కామ్నాజఠ్మలానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ 'డిపార్ట్‌మెంట్' ఫేం నథాలియాకౌర్‌పై ఆ మధ్య ఐటం సాంగ్ చిత్రీకరించారు.

    నాగార్జున ఈ చిత్రం గురించి మాట్లాడుతూ....భాయ్ చిత్రం సీరియస్‌గా వుండే దావుద్ ఇబ్రహీం లాంటి కథ అని భావిస్తున్నారని, కానీ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం ఉంటుందని ఆయన వివరించారు. అలాగే'భాయ్' పేరుతో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి నిజమే, కాని అది మాఫియా నేపథ్యం కాదు. 'హలో బ్రదర్' సినిమా తరహాలో పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. ఇందులో నా పాత్ర 'కింగ్'లో బొట్టు శ్రీనులా వినోదాన్ని పంచుతుంది అన్నారు.

    దర్శకుడు వీరభద్రమ్ చౌదరి చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'రెండున్నర గంటలు కడుపుబ్బా నవ్వించే చక్కటి హాస్య చిత్రమిది. 'హలో బ్రదర్' తరహాలో నాగార్జున పాత్ర చిత్రణ వుంటుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ పాత్రను చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు మాఫియా అనే అంశమే ఈ చిత్రంలో వుండదు. నాగార్జున సంభాషణలు, మేనరిజమ్స్ సరికొత్త పంథాలో వుంటాయి. ఆయన అభిమానుల్ని అలరించే అంశాలన్నీ 'భాయ్'లో వున్నాయి' అన్నారు.

    English summary
    Nagarjuna’s ‘Bhai’ is getting ready for a July release. The movie has completed about 50 percent of its shoot and a fresh schedule will begin in Hyderabad from the 28th. The film’s principal shoot is expected to be wrapped up by end June.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X