నాగార్జున ‘భాయ్’ టీజర్ రివ్యూ...

By Bojja Kumar

హైదరాబాద్ : అక్కినేని నాగార్జున నటించిన 'భాయ్' మూవీ ఫస్ట్ లుక్ అఫీషియల్ టీజర్ యూట్యూబ్ చానల్ ద్వారా విడుదల చేసారు. మాస్ ఎంటర్టెనర్‌గా రూపొందుతునప్న చిత్రం వన్ లైన్ క్యాచీ డైలాగ్స్, ఆకట్టుకునే డ్రామా, పాటలు, యాక్షన్ సీక్వెన్స్, స్టన్నింగ్ యాక్షన్ సన్నివేశాలు, డిఫరెంట్ లొకేషన్లలో షూటింగ్ తదితర ప్రత్యేకలతో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం 140 నిమిషాల పాటు నాన్ స్టాప్ ఎంటర్టెనర్‌గా ఉంటుందని నాగార్జున తెలిపారు.

వన్ ఇండియాతో నాగార్జున మాట్లాడుతూ...'భాయ్ సినిమాకు పని చేసిన ప్రతి రోజూ ఎగ్జైట్‌మెంటుకు గురయ్యాను. సినిమాను ఎంతో డిఫరెంటుగా తెరకెక్కించాం. కేవలం యాక్షన్ మాత్రమే కాదు ప్రేక్షకులకు మంచి కామెడీ పంచుతుంది. డాన్ పాత్రలో, ప్లేబాయ్ పాత్రలో, రొమాంటిక్ సీన్లలో, డాన్సింగ్ స్టైల్‌లో, హెలికాప్టర్ స్టంట్ సీన్లలో భాయ్ ఆకట్టుకుంటుంది' అని తెలిపారు.

బ్యాంకాక్, యూరప్, ఇండియాల్లోని అందమైన లోకేషన్లలో సినిమాను చిత్రీకరించాము. సినిమాలో కనిపించే 15కుపైగా లోకేషన్లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. భాయ్ సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాను. నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన సినిమా. తప్పకుండా ప్రేక్షకులను వినోదాన్ని పంచుతుందనే నమ్మకం ఉంది అన్నారు నాగార్జున.

భాయ్ టీజర్ కోసం క్లిక్ చేయండి

ఈచిత్రంలో నాగార్జున సరసన రీచా గంగోపాధ్యాయ్ నటిస్తున్నారు. ఇంకా సోనూ సూద్, రాహుల్ దేవ్, ముకుల్ దేవ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, జయప్రకాష్ నటిస్తున్నారు. హంసా నందిని, నథాలియా కౌర్ రెండు ఐటం సాంగుల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని అన్నూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగార్జున నిర్మించారు. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సెప్టెంబర్ నెలలో ఈచిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. టీజర్ రివ్యూ స్లైడ్ షోలో...

భాయ్ సినిమాలో నాగార్జున లుక్

భాయ్ సినిమాలో నాగార్జున లుక్

భాయ్ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈచిత్రంలో ఆయన మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్లో ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

ఆకట్టుకున్న టీజర్

ఆకట్టుకున్న టీజర్

52 సెకన్ల నిడివితో విడుదల చేసిన భాయ్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడానికి ఈ టీజర్ బాగా తోడ్పడుతుందని భావిస్తున్నారు.

భాయ్ లవర్‌గా రీచా

భాయ్ లవర్‌గా రీచా

ఈ చిత్రంలో హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ‘భాయ్' ప్రియురాలు పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్లో సన్నివేశాలను బట్టి ఈచిత్రంలో నాగార్జున-రీచా మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని స్పష్టం అవుతోంది.

నాగార్జున్ యాక్షన్

నాగార్జున్ యాక్షన్

భాయ్ టీజర్లో సన్నివేశాలు....సినిమాలో స్టన్నింగ్ యాక్షన్ సీన్లు ఉంటాయని స్పష్టం చేస్తోంది. నాగార్జున కెరీర్లోనే బెస్ట్ యాక్షన్ సీన్లు భాయ్ చిత్రంలో చేసాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.

అద్భుతమైన ఫారిన్ లొకేషన్లు

అద్భుతమైన ఫారిన్ లొకేషన్లు

భాయ్ సినిమాలో విదేశాల్లోని పలు అద్భుతమైన లొకేషన్లు చూడొచ్చు. బ్యాంకాక్, యూరఫ్ దేశాల్లోని వివిధ అద్భుతమైన లొకేషన్లలో పాటలు చిత్రీకరించారు. ప్రేక్షకులకు ఇందులోని సీన్లు సరికొత్త అనుభూతిని కలిస్తాయట.

భాయ్ పంచ్ డైలాగులు

భాయ్ పంచ్ డైలాగులు

భాయ్ సినిమాలో వీరభద్రం రాసిన పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. ‘హైదరాబాద్‌లో రెండు ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్..రెండోది భాయ్' లాంటి డైలాగులు దర్శకుడు అదరగొట్టాడని అంటున్నారు.

నాగార్జున స్టైల్

నాగార్జున స్టైల్

భాయ్ టీజర్ పరిశీలిస్తే ఇందులో నాగార్జున కొత్త స్టైల్‌లో కనిపించనున్నాడని స్పష్టం అవుతోంది. యునిక్ డైలాగ్ డెలివరీ, ట్రెండీ కాస్ట్యూమ్స్, స్టైలిష్ గన్ షాట్స్, నడక, టాకింగ్, సిట్టింగ్ స్టైల్ ఇలా అన్నింటిలోనూ కొత్తదనం చూపించాడని స్పష్టం అవుతోంది.

డిఎస్‌పి మ్యూజిక్

డిఎస్‌పి మ్యూజిక్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించే సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ భాయ్ సినిమాకు హైలెట్‌గా నిలువనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X