twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సీన్స్ తొలిగించాం: ‘భాయ్' దర్శకుడు

    By Srikanya
    |

    హైదరాబాద్: అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'భాయ్' చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. నెగిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం తొలిరోజు మంచి ఓపెన్సింగ్స్ సాధించింది. ఇక ఈ చిత్రంలో మీడియాని విమర్శిస్తూ ఉన్న డైలాగులను తొలిగిస్తున్నట్లు దర్శకుడు వీరభద్రం సక్సెస్ మీట్ పెట్టి తెలిపారు.

    వీరభధ్రం మాట్లాడుతూ...ఇద్దరు కామెడీ హీరోలతో సినిమాలు చేసిన నేను ఈ స్ధాయిలో ఉన్నానంటే కారణం మీడియానే. మీడియాను తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడను. ఈ సినిమాలో మీడియాను కించపరిచేలా ఉన్న సీన్స్ ను తొలిగించాం అని తెలిపారు. అలాగే... నా గత రెండు చిత్రాల్లో ఎంటర్టైన్మెంట్ పాళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో కూడా అలాగే ఉంటాయని చాలా మంది ఎక్సపెక్ట్ చేసారు. తొంభై సినిమాలకు పైగా సినిమాల్లో నటించిన నటించిన నాగార్జునగారిని న్యూ లుక్ లో చూపించాలనుకున్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు సినిమాను మలిచాను. ఫ్యామిలీ ఆడియన్స్ కు, మహిళలకు సినిమా బాగా కనెక్టు అయ్యింది అని తెలిపారు.

    'ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి అన్ని ఏరియాల నుంచి సూపర్‌హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద సంస్థలో తాను ఈ చిత్రాన్ని నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నానని, అన్నిచోట్లనుండి సూపర్‌హిట్ టాక్ వస్తుండడం ఆనందాన్నిస్తోందని, ఎంటర్‌టైన్ మూవీగా ప్రేక్షకులు ఆదరిస్తూ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు' అన్నారు.

    నాగార్జున స్టార్ ఇమేజ్‌కు తోడు పూలరంగడు, అహనాపెళ్లంట లాంటి హిట్ చిత్రాలు చేసిన దర్శకుడు వీరభద్రం చౌదరి తెరకెక్కించిన చిత్రం కావడంతో సినిమాపై ముందు నుంచీ మంచి అంచనాలు ఉండటంతో, ఓపెనింగ్స్ అదిరిపోయాయి. భాయ్ చిత్రాన్ని దాదాపు 900 స్క్రీన్లలో విడుదల చేసారు. తొలిరోజు అన్ని థియేటర్లలో 65% నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ సాధించింది.

    ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎన్.సాయిబాబు మాట్లాడుతూ ' హెవీ రెయిన్స్‌లో సైతం మా చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్ వచ్చాయి. నాగార్జున కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది. అన్ని ఏరియాల్లో కలెక్షన్లు బాగున్నాయి. నాగార్జున స్టయిల్, ఆయన మీద చిత్రీకరించిన సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్, అలాగే నాగార్జున, బ్రహ్మనందం కాంబినేషన్‌లో తీసిన కామెడీ సీన్లు బాగా హైలైట్ అయ్యాయి. ఇంత ఘనవిజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులకు, నాగార్జున అభిమానులకు మా కృతజ్ఞతలు' అన్నారు.

    ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, హంసా నందినీ, నథాలియా కౌర్, కామ్నా జఠ్మలానీ, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్యా మీనన్, సుప్రీత్, అజయ్, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, జరాషా, చలపతిరావు, రాహుల్‌దేవ్, వెనె్నల కిశోర్, ప్రసన్న, హేమ, రజిత, గీతాంజలి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్, కెమెరా:సమీర్‌రెడ్డి, మాటలు:సందీప్ - రత్నబాబు, పాటలు:రామజోగయ్యశాస్ర్తీ, అనంత్ శ్రీరామ్, ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, నిర్మాత:నాగార్జున, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వీరభద్రం.

    English summary
    Inspite of pouring rain & divide talk Bhai has taken a flying start at the Box-Office ! Early estimates say that in Nizam alone the film is on its way to collect Rs.1.5 -Rs.1.75 Crore on its Day 1 which is highest ever for any senior hero in Tollywood !
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X